రెవిన్యూ వ్యవస్థలో సమూల మార్పులు వస్తే గాని ఏపీలో అధికారుల అవినీతికి అడ్డు పడదు. ప్రతి డిపార్ట్మెంట్ లో అవినీతి ఉన్నప్పటికీ రెవిన్యూలో విచ్చలవిడిగా ఉందని చెప్పాలి. ఇప్పటికే రెవెన్యూ డిపార్టుమెంట్ మీద ప్రజలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అయితే క్షేత్ర స్థాయి నుంచి ఎమ్మెల్యేలు ఎంపీల విషయంలో కూడా జగన్ చాలా చాలా స్ట్రిక్ట్ గా  వ్యవహరిస్తున్న దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. గతంలో అధికార పార్టీ కార్యకర్తలు అంటేనే అయిన  కాడికి దోచుకోవడమే అన్నట్టుగా ఉండేది పరిస్థితి. తెలుగుదేశం హయాంలో కార్యకర్తలు నేతలు తేడా లేకుండా ఎవరికి అందింది వారు  దోచుకున్నారు. ఆ పరిస్థితిలో పూర్తి మార్పును చూపుతున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ క్రమంలో తన పార్టీ వాళ్లు అని చూడకుండా వైసీపీ వాళ్లకే ఆయన పూర్తిగా బంధనాలు వేశారు. ఇలా వైఎస్ జగన్ పాలనపై సానుకూల స్పందనలు వ్యక్తం అవుతూ ఉన్నాయి.


జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు వైసీపీ ఎమ్మెల్యేల్లో .. ఎంపీల్లో భయం పుట్టించినా రెవిన్యూలో అలానే ఉంది.  అవినీతి రహిత వ్యవస్థను లక్ష్యంగా చేసుకున్న సీఎంను అంతా అభినందిస్తూ ఉన్నారు.అయితే క్షేత్ర స్థాయిలో పరిస్థితి మరో రకంగా కనిపిస్తూ ఉంది. రాజకీయ పరమైన అవినీతిని అరికట్టడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పూర్తిగా కట్టుబడి ఉన్నారు. ఆ మేరకు పని చేస్తున్నారు. అయితే ఇదే అదునుగా తీసుకుని ఉద్యోగులు మాత్రం తమ దందా సాగిస్తూ ఉన్నారు.


జగన్  పై స్థాయిలో అవినీతిని కట్టడి చేసినా కింది స్థాయిలో మాత్రం అవినీతి కొంచెం కూడా తగ్గలేదు.  అవినీతి అత్యధికం అనదగిన రెవెన్యూ వ్యవస్థలో కొందరు అధికారుల దోపిడీ యథేచ్ఛగా సాగుతూ ఉంది.  అందుకు ఒక ఉదాహరణ ప్రకాశం జిల్లా కనిగిరి మున్సిపాలిటీ లో డిప్యూటీ తహశీల్దార్ గా ఉన్న కిషోర్ కుమార్ తీరు.  ఈ అధికారి దోపిడీకి హద్దే లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి స్థానికుల నుంచి. ప్రతి పనికీ ఒక రేటును ఫిక్స్ చేసి ఈ అధికారి డబ్బులు  తీసుకుంటూ ఉన్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: