మనిషి ఎంతటి ఆశజీవి అంటే తనదగ్గర సరిపడంత ధనం ఉన్న గాని మనసులో ఇంకా ఆశ చావదు. ఇది మనిషిగా పుట్టిన ప్రతివారిలో కనిపిస్తుంది. ఈ ఆశ అనేది ఒక మనిషి జాతికే ప్రత్యేకమైన గుణంగా సంక్రమించింది. ఇకపోతే రోడ్డుపై వెళ్లుతుండగా ఒక రూపాయి బిళ్ల దొరికితేనే వదిలిపెట్టని మనుషులకు అతి విలువైన వస్తువులు దొరికితే మాత్రం ఒకరినొకరు తన్నుకునైనా ఆ వస్తువును స్వంతం చేసుకుంటారు.


సరే డబ్బులు వస్తువుల సంగతి అలా వుంచితే రోడ్డు వెంట వెండి పూసలు దొరికాయనుకో అది చూసిన వారి ఆనందం ఏ స్దాయిలో ఉంటుందో మీరే ఊహించుకోండి. అప్పుడప్పుడు అదుపు తప్పి రోడ్డుపై కూల్‌డ్రింక్ వాహానాలో, లేక మద్యం సరఫరా చేసే వాహనాలో అదుపుతప్పి పడిపోతే బ్యాగులు బ్యాగులు తెచ్చుకొని నింపుకొని వెళ్లే మనుషులున్న ఈ కాలంలో వెండి పూసలు పడితే విడిచిపెడతారా విడిచి పెట్టరు కదా. ఇప్పుడు ఇలాగే జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్లితే.. 


ఇండో-నేపాల్​ సరిహద్దు లోని బీహార్ సుర్సంద్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో స్థానికులు రహదారిపై కనిపించిన వెండి పూసలను ఎగబడి ఏరుకుంటూ కనిపించారు. ఇదెలా తెలిసిందంటే ఉదయం రోడ్డుపైకి వాకింగ్‌కు వచ్చిన కొందరికి బఠానీల పరిమాణంలో కొన్ని గుండ్లు కనిపించడంతో అంతా ఆశ్చర్యపోయారు. దగ్గరగా తీసుకొని పరిశీలించగా అవి వెండి గుండ్లు అని తేలింది. ఈ విషయం ఆనోట ఈ నోట దావానంలా వ్యాపించడంతో స్థానికులంతా వీటి కోసం రోడ్డుపై వెతుకులాట ప్రారంభించారు.


అందులో చిన్నా పెద్దా తేడా లేకుండా ఎవరికి దొరికినంత వారు తీసుకొని వెళ్లిపోయారు. దీంతో రహదారిపై కొంత సేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఈ విషయం తెలుసుకున్న  పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని పరిసరాలను తనిఖీ చేసి, రాత్రి సమయంలో స్మగ్లర్లు పెద్ద ఎత్తున వెండి ఆభరణాలు అక్రమ రవాణా చేస్తుండగా కొన్ని పడిపోయినట్టు అనుమానిస్తున్నారు.


ఇప్పటికే సరిహద్దు ప్రాంతాల్లో గోల్డ్, సిల్వర్ అక్రమ రవాణాపై అధికారులు దృష్టిసారించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపి స్మగ్లర్లను గుర్తిస్తామని పోలీసులు చెబుతున్నారు. ఏది ఏమైనా వెండి పూసలు దొరికిన వారు మాత్రం తమ ఇళ్లకు వెళ్లి పండగ చేసుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: