ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకునే మోదీ ప్రభుత్వం  ఇప్పుడూ కార్మికుల కోసం పోరాటం చేస్తున్న కార్మికులకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ  కార్మికుల పని గంటలను  9 గంటలకు పెంచుతూ  ప్రతిపాదనలు చేసింది కానీ కనీస వేతనాన్ని నిర్ణయించడానికి మాత్రం అంతగా ఆసక్తి చూపని ప్రభుత్వం  ప్రస్తుతం ఉన్న పని గంటలను 8 నుంచి 9కి పెంచాలని సూచించింది దీనితో  కార్మిక సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.

జాతీయ కనీస వేతన చట్టం ప్రకారం జులై 2018 నుంచి రోజుకు రూ.375 చెల్లించాలని ఈ సంవత్సరం జనవరిలో కేంద్ర కార్మిక శాఖ ఒక నివేదికలో తెలిపింది దీనితో పాటు నెలకు రూ.9,750 కనీస వేతనం చెల్లించాలని సిపార్సు చేసింది. అలాగే నగరాల్లో పనిచేసే కార్మికులకు హెచ్‌ఆర్ఏ రూ.1,430 అదనంగా అందజేయాలని సూచించింది.  దీనిపైనా కార్మికుల అభిప్రాయాలను సేకరించి అనంతరం ఈ బిల్లుకు ఆమోదం తెలుపుతారు. 
ఇక ఇంటి ఖర్చుల దృష్ట్యా ఇంధనం, విద్యుత్, ఇతర వస్తువులపై ఖర్చులు 20 శాతంగా ఉంటుంది. వేతనాన్ని లెక్కించేటప్పుడు ఒక కుటుంబానికి రోజుకు 2,700 కేలరీల ఆహారం, సంవత్సరానికి 66 మీటర్ల దుస్తుల అవసరాలను  పరిగణనలోకి తీసుకొని ఈ వేతనాలను నిర్ణయిస్తారు.

ఇవి మాత్రం గత సంవత్సరాల మాదిరిగానే పాత విషయమే ఆయన ఎక్కడ ప్రస్తావించడం గమనార్హం.   దాదాపు 40 చట్టాల్లో 13 చట్టాలను కలిపేసి కార్మికుల వ్యక్తిగత భద్రత, ఆరోగ్యం, పనిపరిస్థితులు గమనించి  కొత్తగా స్మృతిబిల్లు- 2019   రూపొందిస్తున్నారు. దీని ద్వారా కార్మికులకు మంచి ఫలితాన్ని పొందవచ్చని వారికీ పనికి సమానంగా అప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుందని వివరించారు . 
మరో నాలుగు ప్రధాన చట్టాలు  ఎప్పుడు వేతన బిల్లు గా మారాయి.1948 కనీసవేతనాల చట్టం, 1936 వేతనాల చెల్లింపు చట్టం, 1965 బోనస్ చెల్లింపు చట్టం, 1976 సమాన వేతన చట్టం వేతన కోడ్ బిల్లుగా వచ్చేశాయి. కొత్త కోడ్‌లో 69 క్లాజులను పొందుపరిచారు. తొలి చాప్టర్‌లో నిర్వచనాలు, త ర్వాత కనీస వేతనాలు గురించి, వేతనాల చెల్లింపు, బోనస్ చెల్లింపు, సలహా మండళ్లు, బకాయిల చెల్లింపు, ఆడిటింగ్, ఇనస్పెక్టర్ల నియామకం, నేరాలు, ఇతర అంశాల గురించి ఈ చట్టం లో చేర్చారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: