ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంచలన  నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది . పథకాల విషయంలోనే కాదు ప్రాజెక్టుల విషయంలో కూడా సంచలన నిర్ణయం తీసుకుంది జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వం. ఈ క్రమంలోనే పోలవరం ప్రాజెక్టు విషయంలో రివర్స్ టెండరింగ్ అనే సంచలన నిర్ణయం తీసుకుంది. పోలవరం పనుల్లో అవకతవకలు జరిగాయంటూ... వాటిని సరి చేసేందుకు ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ కు వెళ్తుందని ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయితే రివర్స్ టెండరింగ్ పై ప్రతిపక్షాలన్నీ దుమ్మెత్తి పోసింది . ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు ను  నిర్వీర్యం చేసేందుకు వైసీపీ ప్రభుత్వం భావిస్తోందని మండిపడ్డారు. కానీ రివర్స్ టెండరింగ్ లో జగన్ సర్కార్ విజయం సాధించింది. రివర్స్ టెండరింగ్ కు వెళ్లడం ద్వారా కొన్ని కోట్ల రూపాయల ప్రభుత్వానికి ఆదా అయిందని  తాజాగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. 



 పోలవరం హైడల్ ప్రాజెక్టు ఒప్పందాన్ని నవయుగ సంస్థకు కట్టబెట్టింది జగన్ సర్కార్. ఆ తర్వాత నవయుగ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు ఆ కాంట్రాక్టును మేఘా సంస్థకు అప్పగించింది. కాగా గత శుక్రవారం ఈ పనులు కూడా మేఘ సంస్థ ప్రారంభించింది. కాగా తాజాగా హైడల్ ప్రాజెక్టు పనులను తక్షణమే నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జగన్ సర్కార్ కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలవరం హైడల్ ప్రాజెక్టు పనులకు  మరోసారి అడ్డుకట్ట పడ్డట్లయింది. నవయుగ సంస్థ వేసిన పిటిషన్ పై ఈరోజు విచారించిన ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు... ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. దీనికితోడు నవయుగ సంస్థ వేసిన పిటిషన్ పై విచారణను మంగళవారానికి వాయిదా వేసింది హైకోర్టు. 



 కాగా విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదిస్తూ పనులు నిలిచిపోతే అన్ని విధాలుగా నష్టం వాటిల్లిందని... హై కోర్టుకు విన్నవించారు. ఒకవేళ మళ్లీ వరదలు పోటెత్తితే  పోలవరం హైడల్ ప్రాజెక్టు పనులు చేపట్టడం కష్టతరమవుతుంది ప్రభుత్వం తరఫు న్యాయవాది హై కోర్టుకు విన్నవించారు. అయితే ఈ వాదనతో హైకోర్టు మాత్రం ఏకీభవించలేదు. మరో 15 రోజుల పాటు పనుల నిలిచిపోయిన ఎలాంటి నష్టం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. పోలవరం హైడల్ ప్రాజెక్టు పనులను తక్షణమే నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను హైకోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుందోనని ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి: