తాజాగా ఆంధ్రప్రదేశ్ లో అన్నీ పాఠశాలలు ఇంగ్లీష్ మీడియం లోనే ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించే పేద విద్యార్ధులుకు మంచి ఉద్యోగావకాశాల రావాలంటే వారు ఇంగ్లీష్ మీడియం లోనే చదవాలని..అలాగే కేవలం ఆంగ్ల మాధ్యమాలలో ఉండే ఉన్నత విద్యల్లో కూడా విద్యార్ధులు ఎటువంటి ఇబ్బందులు పడకూడదని ఫస్టు నుంచే ఇంగ్లీష్ బాషా నేర్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యామంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రేవేశ పెట్టినంతమాత్రాన మాతృ బాషా అయినా తెలుగు ని నిర్లక్ష్యం చేయమని తెలిపారు. తెలుగుకు కూడా సముచిత స్థానం ఇస్తామని ఆయన తెలిపారు.


కానీ ఇంగ్లీష్ మీడియాన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రేవేశ పెట్టినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఇప్పుడు ఉన్న టీచర్లకు ఆంగ్లంలో బోధించే సామర్థ్యం ఉందా? అని ప్రశ్నిస్తున్నారు కొందరు. ఇంకా ఎన్నో రకమైన విమర్శలు వామపక్షాల నుంచి వస్తుండడంతో... వైసీపీ ఎంపీ అయినా విజయసాయి రెడ్డి ఘాటుగా స్పందించారు.


‘మీ పిల్లల్ని మాత్రం ఇంగ్లిష్ మీడియంలోనే చదివిస్తారు. పేద పిల్లలు మాత్రం తెలుగులోనే చదవాలి. వాళ్లు ఉన్నత స్థాయికి ఎదగ కూడదు. విదేశాల్లో ఉన్నత చదువులకు వెళ్ల కూడదని కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు తండ్రీ కొడుకులు. దేవాన్ష్ ను తెలుగు మీడియంలో చదివిస్తామని చెప్పండి చూద్దాం?’ అని విజయ్ సాయి రెడ్డి ఛాలెంజ్ చేసారు. చంద్రబాబు దత్త పుత్రుడైన లోకేష్ ఈ సవాలుకి ఏ విధంగా స్పందిస్తాడో చుడాలిక. 


ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ బోధనోపాధ్యులకు నాణ్యత ప్రమాణాలు కలిగి ఉన్న యూనివర్సిటీ లాలోని ఇంగ్లీష్ ప్రొఫెసర్లు తో ప్రత్యేకంగా నాణ్యమైన శిక్షణ ఇచ్చి ఆంగ్ల భాషలో అనర్గళంగా బోధించేటట్లు చేస్తామని విద్యామంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: