ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మళ్ళి షాక్ తగిలింది. చంద్రబాబుకు ఈ సంవత్సరం అస్సలు మంచి జరగలేదు పాపం... ఓ వైపు అధికారాన్ని పోగుట్టుకొన్నాడు.. మరో వైపు ప్రజల్లో కలిసిన గత అయిదేళ్ళు చేసింది చాలులే బాబు.. కాస్త రెస్ట్ తీసుకో అని చెప్పకనే చెప్తున్నారు. మరో వైపు ముద్దుల కొడుకు నారా లోకేష్ కి అష్ట కష్టాలు.          


ఇలా అన్ని కష్టాలు ఒకేసారి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు తెగ ఇబ్బంది పడుతున్నాడు. అయితే ఇంత ఇబ్బంది వచ్చిన చంద్రబాబు నాయుడు అధికార పార్టీని హింసించడం మాత్రం మానలేదు. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయినా కాకముందే అన్ని క్రమంగా చేసుకుంటూ వచ్చిన ఇవి చెయ్యలేదు.. అవి చెయ్యలేదు అంటూ ప్రశ్నించడం మొదలు పెట్టింది.          


ఈ నేపథ్యంలోనే మొన్న దత్తపుత్రుడితో చంద్రబాబు నాయుడు భవన కార్మికుల ఆత్మహత్యలకు నిరసనగా విశాఖలో లాంగ్ మార్చ్ చేయించగా .. ఇప్పుడు అయన దీక్ష చెయ్యాలనుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 14న విజయవాడలో దీక్ష చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. కానీ పాపం చంద్రబాబుకి ఈసారి కూడా గెట్టి షాక్ తగిలింది .       


విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో దీక్షకు అనుమతించాలని నగర పోలీస్, మున్సిపల్ కమిషనర్లను తెలుగు దేశం పార్టీ కోరింది. అయితే, ప్రభుత్వ కార్యక్రమాలకు తప్ప ఇతర కార్యక్రమాలకు ఇక్కడ అనుమతి ఇవ్వలేవని.. అనుమతిని నిరాకరించినట్టు వారు తెలిపారు. దీంతో, ప్రత్యామ్నాయంగా ధర్నా చౌక్ ను టీడీపీ నేతలు పరిశీలిస్తున్నారు. మరి చంద్రబాబు దీక్ష 14న జరుగుతుందా ? లేదా అనేది చూడాలి.       



మరింత సమాచారం తెలుసుకోండి: