ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గత కొంతకాలంగా ఇసుక కొరత సమస్య పట్టిపీడిస్తున్న విషయం తెలుసిందే.5 నెలల  నుంచి సరైన ఉపాధి లేక భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. కనీస ఉపాధి కరవై భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలన్ని  రోడ్డున పడుతున్నాయి. రాష్ట్రంలో ఏర్పడిన ఇసుక కొరత సమస్యను  తీర్చి ... కార్మికులకు ఉపాధి కల్పించాలని ప్రతిపక్ష పార్టీలన్నీ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఇసుక విధానం వల్లే రాష్ట్రంలో ఇసుక కొరత  ఏర్పడినట్టు విమర్శలు గుప్పిస్తూన్నాయి. కాగా ఇప్పటికే ఈ సమస్యపై టిడిపి నేత నారా లోకేష్ ఒకరోజు దీక్ష చేపట్టగా...  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ నిర్వహించారు. అయితే ఈ నెల 14న విజయవాడలో ఇసుక  కొరతకు  నిరసనగా చంద్రబాబు దీక్ష తలపెట్టారు. 



 అయితే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుకు పోలీసులు షాక్ ఇచ్చారు. చంద్రబాబు దీక్షకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం లో అనుమతి ఇవ్వాలంటూ విజయవాడ పోలీస్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్లను టీడీపీ నేతలు కోరారు. టిడిపి నేతలు విజ్ఞప్తి పోలీసుల తోసిపుచ్చారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం లో కేవలం ప్రభుత్వ కార్యక్రమాలు తప్ప ఇతర కార్యక్రమాలకు అనుమతి ఇవ్వబోము అంటూ  పోలీసులు స్పష్టం చేశారు. చంద్రబాబు దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ చంద్రబాబు తలపెట్టిన దీక్ష మాత్రం కొనసాగుతుందని నేతలు స్పష్టం చేశారు. 



 ఇందిరాగాంధీ స్టేడియం లో చంద్రబాబు దీక్ష చేపట్టేందుకు పోలీసులు నిరాకరించడంతో ప్రత్యామ్నాయంగా ధర్నా చౌక్ పరిశీలిస్తున్నట్లు టీడీపీ నేతలు తెలిపారు. రాష్ట్రంలో ఏర్పడిన ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ రంగం కుదేలవుతుందని విమర్శలకు దిగుతున్నాయి ప్రతిపక్షాలు. ఐదు నెలల నుంచి ఉపాధి లేని  భవన నిర్మాణ రంగ కార్మికులకు నెలకి పదివేలు చొప్పున 50వేలకి చెల్లించాలని అంతేకాకుండా ఆత్మహత్య చేసుకున్న నిర్మాణ రంగ కార్మిక కుటుంబాలకు 5లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి  ప్రతిపక్షాలు. కాగా నవంబర్ 14న చంద్రబాబు తలపెట్టిన దీక్షతో  రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయో  అని చర్చించుకుంటున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: