గత రెండు రోజుల క్రితం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధి లోని అబ్దుల్లాపూర్ మెట్ మండలం లోని మండల రెవిన్యూ ఆఫీసర్ విజయ రెడ్డి హత్య తరువాత ఎలాంటి కేసులు వివిధ ప్రాంతాలలో నమోదు అవుతున్నాయి. నిన్న జరిపిన పోలీసు దర్యాప్తులలో విజయ రెడ్డి లంచం తీసుకొని తన స్థలాన్ని వేరే వారికీ పట్టాచేయడానికి లక్షల్లో లంచం తీసుకున్నట్లు బయటకు రావడం తో  అవినీతి నిరోధక శాఖ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లలో అలర్ట్ అయినట్లు అనిపిస్తుంది అని సమాచారం. అలాగే అవినీతి నిరోధక శాఖ  వలకు చిక్కిన  కర్నూలు జిల్లా గూడూరు మున్సిపాలిటీ తహశీల్దార్ హసీనా బీ సురేశ్ అనే రైతు తన భూమి వివాదాన్ని పరిష్కరించాలని తహశీల్దార్ హసీనా బీని కోరాడు.

భూ వివాదాన్ని పరిష్కరించాలంటే తనకు 8 లక్షల రూపాయలు లంచం ఇవ్వాలని హసీనా బీ రైతును డిమాండ్ చేసింది. రైతు అంత డబ్బును లంచంగా ఇవ్వలేనని చెప్పగా హసీనా బీ 4 లక్షల రూపాయలు ఇస్తే సమస్య పరిష్కరిస్తానని చెప్పింది అది ఎప్పుడు ఎలా సమర్పించాలో నేను వివరిస్తానని చెప్పింది అది  4 లక్షల రూపాయలను కర్నూలు జిల్లా పాణ్యం బస్టాండు దగ్గర తన సోదరుడైన మహబూబ్ భాషా అనే వ్యక్తికి ఇవ్వాలని రైతుకు సూచించింది. 

రైతు సురేష్ ఇదంతా జరిగింది జరిగినట్లు  అంతకు ముందే కర్నూలు జిల్లా అవినీతి నిరోధక శాఖ అధికారులకు సమాచారం అందించాడు. పాణ్యం బస్టాండులో రైతు నుండి మహబూబ్ భాషా 4 లక్షల రూపాయలు తీసుకొనే సమయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు మహబూబ్ బాషా ను పట్టుకున్నారు. వాడిని విచారించగా నాకు ఏమి తెలియదని మా అక్క గూడూరు మున్సిపాలిటీ తహశీల్దార్ హసీనా బీ తీసుకోమంటేనే తీసుకున్నానని ఏది లంచం గా ఇస్తున్నాడు అని తెలియదని చెప్పాడు.

అతడి దగ్గర తహశీల్దార్ హసీనా బీ ఫోన్ నెంబర్ తీసుకొని అవినీతి నిరోధక శాఖ అధికారులు  ఫోన్ చేయగా వారి గొంతుని గుర్తించిన హసీనా తన ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసింది. అది తెలిసిన గూడూరు వాసులు ఆమె చాల మందిని ఇబ్బందులకు గురి చేసి లంచాలను తీసుకునేదని డబ్బులేకుండా అసలు పనే చేసేది కాదని వివరాలు . అవినీతి నిరోధక శాఖ అధికారులు  ఆమెను కచ్చితంగా పట్టుకొని శిక్షపడేలా చూస్తామని హామీ ఇచ్చారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: