ఆర్టికల్ 370 రద్దు తరువాత పాకిస్తాన్.. ఇండియా మధ్య పచ్చగడ్డి వేయకుండానే మంటలు మండుతున్నాయి.  మంచుకురుస్తున్న కాశ్మీరంలో తుపాకీ గుండ్లు వేడి పుట్టిస్తున్నాయి.  పాక్ కాల్పుల ఉల్లంఘనను అతిక్రమించి పాకిస్తాన్ పదేపదే ఇండియన్ సైనికులపై కాల్పులు జరుపుతున్నారు.  పాక్ కాల్పులను ఇండియన్ సైనికులు నిరంతరం ఎదుర్కొంటు తిప్పికొడుతున్నారు.  కాశ్మీర్లో అల్లర్లు సృష్టించేందుకు ముష్కరులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.  


ఆ ప్రయత్నాలను కూడా ఇండియా తిప్పికొడుతున్నది.  ఇకపోతే, ఇండియా .. పాక్ దేశాల నిర్మించిన కర్తార్ పూర్ కారిడార్ ఇప్పటికే పూర్తయింది.  ఇండియాలోని గురుదాస్ పూర్ నుంచి పాక్ లోని గురుద్వారా సాహెబ్ వరకు ఈ కారిడార్ ను నిర్మించారు.  గురునానక్ 550 జయంతి సందర్భంగా ఈ కారిడార్ ను ఓపెన్ చేస్తున్నారు.  ఈ కారిడార్ ద్వారా గురుద్వారాలోని గురునానక్ సమాధిని సందర్శించుకోవచ్చు.  మాములు రోజుల్లో గురుద్వారాను సందర్శించాలి అంటే లాహోర్ వెళ్లి అక్కడి నుంచి వెళ్లాల్సి వచ్చేది.  ఈ కారిడార్ ఏర్పాటు చేయడం వలన కేవలం అంతర్జాతీయ బోర్డర్ నుంచి 4.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గురుద్వారాకు వెళ్లొచ్చు.  


ఈ కారిడార్ కు సంబంధించిన ఒప్పందాలు ఇప్పటికే పూర్తయ్యాయి. రేపు గురుదాస్ పూర్ లోని కారిడార్ ను ప్రధాని మోడీ ప్రారంభించబోతున్నారు.  అటు పాక్ లో కారిడార్ ను ఇమ్రాన్ ఖాన్ ప్రారంభించబోతున్నారు.  ఇంతవరకు బాగానే ఉన్నది.  అయితే, ఈ కారిడార్ నుంచి గురుద్వారా వెళ్లే వాళ్లకు మొదట పాస్ పోర్ట్ అవసరం లేదని, ఫీజు 20డాలర్లు చెల్లించాల్సిన అవసరం లేదని పాక్ చెప్పింది.  కానీ, ఇప్పుడు మరలా పాక్ మొదటికి వచ్చింది.  


కారిడార్ నుంచి గురుద్వారా వెళ్లే వాళ్లకు తప్పనిసరిగా పాస్ పోర్ట్ ఉండాలని, 20 డాలర్ల ఫీజు చెల్లించాల్సిందే అని పాక్ పట్టుబడుతున్నది.  మొదటి రోజు ఈ ఫీజు లేదని చెప్పిన పాక్, క్షణాల్లోనే మాటను మార్చేసింది.  ఇప్పటికే పాకిస్తాన్ ఆర్ధికంగా కుదేలైంది.  ఆర్ధికంగా తిరిగి పాక్ అభివృద్ధిలోకి రావాలి అంటే.. ఆ దేశంలో ఆర్ధిక సంస్కరణలతో పాటు ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి.  అప్పటి వరకు పాక్ ఆర్ధికంగా ఎదగడం అన్నది కష్టం.  


మరింత సమాచారం తెలుసుకోండి: