ఈ నెల 2వ తేదీన ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు ప్రాంగణంలో లాయర్లకు పోలీసులకు మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఈరోజు 2వ తేదీన జరిగిన గొడవలకు సంబంధించిన ఒక షాకింగ్ వీడియో బయటకొచ్చింది. పోలీసులకు, లాయర్లకు గొడవలు జరుగుతున్న విషయం తెలియటంతో డీసీపీ మోనికా భరద్వాజ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. గొడవ పడుతోన్న లాయర్లను, పోలీసులను మోనికా భరద్వాజ్ ప్రశాంతంగా ఉండాలని కోరారు. 
 
కానీ మోనికా భరద్వాజ్ ఊహించని విధంగా లాయర్ల సమూహం మోనికా భరద్వాజ్ పై దాడి చేసింది. సీసీ కెమెరాలో మోనికా భరద్వాజ్ పై జరిగిన దాడికి సంబంధించిన దృశ్యాలు నమోదయ్యాయి. ఢిల్లీ పోలీస్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు 200 మంది లాయర్లు దాడి చేసిన సమూహంలో ఉన్నారని చెబుతున్నారు, జాతీయ మహిళా కమిషన్ మహిళా డీసీపీపై లాయర్లు దాడి చేయటాన్ని ఖండించింది. 
 
జాతీయ మహిళా కమిషన్ ఛైర్మన్ రేఖా శర్మ ఈ కేసును సుమోటాగా స్వీకరించారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు రేఖా శర్మ సమన్లు జారీ చేశారు. మోనికా భరద్వాజ్ పై దాడి ఘటనను ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ స్వాతి మలివాల్ ఖండించారు. శాంతి నెలకొనే విధంగా పోలీసులు, లాయర్లు సంయమనంతో వ్యవహరించాలని స్వాతి మలివాల్ చెప్పారు. 
 
తీస్ హజారీ కోర్టులో చిన్నగా ఈ గొడవ ప్రారంభమై పెద్దదిగా మారింది. పోలీసులు దాడికి నిరసనగా ఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ముందు నిరసన వ్యక్తం చేసి లాయర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు నిరసన వ్యక్తం చేసిన తరువాత లాయర్లు కూడా నిరసన వ్యక్తం చేశారు. ఒకరోజు లాయర్లు విధులు బహిష్కరించారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దాడులకు పాల్పడిన లాయర్లను గుర్తించాలని ఆదేశాలు జారీ చేసింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: