మొత్తానికి హిందూత్వం ఇలా కలవకలేక చతికిలపడిందంటున్నారు. ఇద్దరి భావ సారూప్యం ఒకటే. ఇద్దరి దారులూ ఒకటే కానీ రాజకీయం మాత్రం విడదీస్తోంది. కుర్చీ మీద ప్రేమతో సిధ్ధాంత రాహిత్యం బయటపడుతోంది. కాంగ్రెస్, ఎన్సీపీని తిట్టిపోసిన శివసేన పులి ఇపుడు వారి ముందు సాగిలపడుతోంది. ఎలాగైనా కుర్చీ కావాలంటోంది. మరో వైపు బీజేపీ సైతం ముఖ్యామంత్రి పదవి వదులుకోవడానికి ససేమిరా అంటోంది  ఈ మొత్తం ఎపిసోడ్ లో సీఎం ఫడ్నవీస్ ఈ రోజు  రాజీనామా  చేయడం హైలెట్.


ఇదిలా ఉండగా మహారాష్ట్రలో 56 సీట్లు గెలుచుకున్న శివసేన శివ తాండవమే చేస్తోంది. తాను అనుకున్నట్లుగానే రెండున్నరేళ్ల పాటు సీఎం కుర్చీ ఇవ్వాలని మడత పేచీ పెడుతోంది. కేవలం 29 ఏళ్ళ యువకుడు, తొలిసారి రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయిన  ఆదిత్య ధాకరేకు సీఎం కుర్చీ ఇవ్వాల్సిందేనని పట్టుపడుతోంది. కారణమేంటి అంటే బీజేపీకి మెజారిటీ లేదట. సీట్లు కూడా తగ్గిపోయాయట. ఎంత సీట్లు తగ్గినా బీజేపీకి ఇపుడున్న శివసేన సీట్ల కంటే కూడా ఎక్కువే ఉన్నాయి. పైగా శివసేన సీట్లు కూడా తగ్గిపోయాయి. ఇక రెట్టింపు సీట్లు తనకంటే వచ్చిన బీజేపీకి ముఖ్యమంత్రి సీటు దక్కకూడదట. తొలి రెండున్నరేళ్ళు తాము సీఎం కుర్చీ మీద కూర్చోవాలట. ఆ మీదట మద్దతు ఇస్తారో లేదో ఓ పెద్ద  డౌట్. మరి కేంద్రంలో అధికారంలో ఉంటూ మహారాష్ట్రను అయిదేళ్ళ పాటు ఏలిన బీజేపీకి ఎంతగా మండి ఉంటుంది. అందుకే శివసేనకు సీఎం కుర్చీ లేదని చెప్పేసింది.


దాంతో పొత్తు కుదరక కధ మొదటికి వచ్చింది, ఈ రోజుతో శాసనసభ గడువు అయిపోవడంతో సీఎం ఫడ్నివీస్  రాజీనామా చేశారు. ఇక శివసేన మళ్ళీ ఎన్సీపీ వద్దకు వెళ్ళింది.  కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కలిస్తే తుమ్మితే వూడే ముక్కు లాంటి సర్కార్ ఏర్పడుతుంది. అది కుదరకపోతే రాష్ట్రపతి పాలన వస్తుంది. మాట వినకుండా మంకుప‌ట్టు పడుతున్న శివసేన ఇప్పటికే బాలధాకరే నాటి వైభోగం కోల్పోయింది. మళ్ళీ ఎన్నికలు కనుక వస్తే ఈసారి ఆ సీట్లు కూడా శివసేనకు దక్కవు. బీజేపీకే మంచి మెజారిటీ వస్తుంది. సరిగ్గా ఈ లాజిక్ తోనే బీజేపీ ఇపుడు పక్కన ఉంది. చూద్దాం మహారాష్ట్రలో ఏం జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: