ఆంధ్ర ప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభివృద్ధి ఎవరు మెచ్చరు చెప్పండి. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయినా అవ్వలేదు ప్రజల ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తున్నాడు. వారి కష్టాలను అర్థం చేసుకొని వారికీ కావాల్సింది వారి ముందు పెడుతున్నాడు. గతంలో ఎన్నడూ ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అభివృద్ధి చేసి రాజన్న రాజ్యాన్ని గుర్తు చేస్తున్నాడు. 

                  

 
ఈ నేపథ్యంలోనే ప్రముఖ సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పాలన ఎంతో అద్భుతంగా ఉందని అయన వ్యాఖ్యానించారు. గతంలో ఎన్నడూ ఏ నాయకుడు చెయ్యని అభివృద్ధిని, సంక్షేమ పథకాలు సీఎం జగన్ జగన్ అమలు చేస్తున్నారని ప్రశంసించారు. 

                       

 
కాగా సామాజిక న్యాయం కోసం సీఎం జగన్ చేస్తున్న కృషి ఎంతో గొప్పది అని అన్నారు. జనాభాలో 54శాతం ఉన్న బీసీలకు చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని జగన్ ప్రయత్నిస్తున్నారని, అది అభినందనీయమని నారాయణమూర్తి స్పష్టం చేశారు. రిజర్వేషన్ల కొరకు పార్లమెంట్‌లో బిల్లు పెట్టినందుకు సీఎం వైఎస్‌ జగన్‌కు నారాయణమూర్తి హృదయ పూర్వక అభినందనలు తెలిపారు.

                         

 
అయితే నారాయణ మూర్తి ప్రసంశలు విన్న కొందరు ప్రతి పక్ష నాయకులూ కళ్ళలో కారం పోసుకుంటుంటారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. మరి కొందరు.. ఏంటి అందరూ సీఎం జగన్ నే ప్రశంసిస్తారు.. కొందరైనా చంద్రబాబు, అతని దత్తపుత్రుడిని ప్రశంసించాలి కదా అంటూ చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మరి చంద్రబాబు స్పందన ఏంటో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: