2016వ సంవత్సరంలో సరిగ్గా ఇదే రోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్ల రద్దును ప్రకటించి, తన కేబినెట్ సహచరులతో పాటు మొత్తం దేశప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తారు. ప్రధాని ఆ రోజు రాత్రి 8 గంటలకు చేసిన ప్రసంగంలో. రాత్రి 12 గంటల నుంచి 500, 1000 రూపాయల నోట్లు చెల్లుబాటు కావని తేల్చి చెప్పారు.తనకు 50 రోజులు గడువు ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు.

''నేను మీ నుంచి కేవలం 50 రోజుల గడువును కోరుతున్నాను. నాకు డిసెంబర్ 30 వరకు గడువు ఇవ్వండి. డిసెంబర్ 30 తర్వాత నా తప్పు ఉందని తేలితే, మీరు నన్ను ఏ చౌరస్తాలోనైనా నిలబెట్టి, ఏ శిక్ష విధించినా భరిస్తాను'' అన్నారు.దేశప్రజలకు శరాఘాతంగా పరిణమించిన తన నిర్ణయాన్ని ఆయన నల్లధనాన్ని అరికట్టడానికి తీసుకున్న చర్యగా చెప్పుకున్నారు. ఉగ్రవాదం, తీవ్రవాదంపై అది సర్జికల్ స్ట్రైక్ అని ప్రకటించారు. నగదు రహిత ఆర్థిక వ్యవస్థ, డిజిటల్ సమాజంపై వైపు ఒక పెద్ద ముందడుగు అని తెలిపారు.


నోట్లు రద్దు చేసిన ఉద్దేశాలన్నీ నెరవేరినట్లు 2019లో మోదీ ప్రభుత్వం చెప్పింది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. 500, 1000 నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ క్రమబద్ధీకరణ జరిగిందని. పన్ను వసూళ్లు పెరిగాయని, అభివృద్ధి రేటు కూడా పెరిగిందని ప్రకటించారు.కానీ రద్దు చేసిన నోట్లలో 99.3 శాతం 2017లో తిరిగి వ్యవస్థలోకి వచ్చేశాయని bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.రిజర్వ్ బ్యాంక్ ప్రకారం నోట్లను రద్దు చేసినపుడు రూ.15,41,000 కోట్ల విలువైన 500, 1000 రూపాయల నోట్లు చలామణిలో ఉన్నాయి.దానిలో రూ.15,31,000 కోట్లు తిరిగి వ్యవస్థలోకి వచ్చేశాయి.అంటే కేవలం 10 వేల కోట్లు మాత్రం తిరిగి రాలేదు

నోట్ల రద్దు నిర్ణయం విఫలమైనా, రాజకీయ వర్గాలకు మాత్రం ప్రయోజనం చేకూరిందని ఆర్థిక నిపుణులు అన్నారు.''నిజానికి బీజేపీ ధనికులు, చిన్న వ్యాపారుల పార్టీ కాదు.. సామాన్యుల పార్టీ అని తెలియజేయడం ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశం. ప్రభుత్వం నల్లధనాన్ని అంతం చేయాలనుకుంటోంది అని వెల్లడించడం కూడా ఒక అంశం'' అని ఒక ఆర్థిక నిపుణుడు వివరించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: