జగన్ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు దాటింది. ఈ ఐదు నెలల పరిపాలన కాలంలో జగన్ చాలానే కొత్త నిర్ణయాలు, పథకాలు అమలు చేశారు. దాని వల్ల ప్రజలకు కూడా బాగానే మేలు జరిగింది. కానీ ఈ ఐదు నెలల్లోనే ప్రతిపక్షాలు జగన్ ప్రభుత్వంపై చేసిన విమర్శలు, ఆరోపణలు అన్ని ఇన్ని కాదు. జగన్ తీసుకునే ప్రతి నిర్ణయంపై విమర్శలు చేయడమే. పైగా ఈ మధ్య దీక్షలు, పోరాటాలు అంటూ అప్పుడే రోడ్లు మీదకొచ్చేస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ,జనసేన, బీజేపీలు జగన్ అంటే చాలు ఓ విరుచుకుపడిపోతున్నారు.


అయితే ఈ మధ్య టీడీపీ-జనసేనలు కలిసి మరి పోరాటాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే పవన్...పోరాటాలకు పెట్టింది పేరైనా వామపక్షాలని దూరం చేసుకున్నట్లు కనిపిస్తోంది. మొన్న ఎన్నికల్లో వీరు జనసేనతో కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. కానీ తర్వాత వీరి మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. ఇప్పుడే వారిని జగన్ దగ్గర చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే రాష్ట్రంలో వామపక్షాలకు అంత బలం లేకపోయినా, వారి పోరాటాలకు చాలా వరకు విలువ ఉంది.


వారు సరైన కారణాలపైనే పోరాటం చేస్తుంటారు. ఉదాహరణకు గత టీడీపీ ప్రభుత్వంలో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని వామపక్ష నేతలు ఎక్కువగా ఆందోళనలు చేశారు. అందులో ముఖ్యంగా ఇటీవల ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయిన సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు కీలక పాత్ర పోషించారు.  వారి పోరాటాల ఫలితం కావొచ్చు. జగన్ హామీ కావొచ్చు. నేడు అగ్రిగోల్డ్ బాధితులకు వైసీపీ ప్రభుత్వం సాయం చేసింది.


ఈ విషయంలో సీపీఐ జగన్ పట్ల సానుకూలంగా ఉంది. అటు తాజాగా అనారోగ్యంతో ఉన్న సీపీఎం ప్రధాన కార్యదర్శి మధుని జగన్ పరామర్శించారు. ఈ పరిణామాలతో వామపక్ష పార్టీలు జగన్ పట్ల పాజిటివ్ గా ఉన్నారు. మొత్తానికి పవన్-చంద్రబాబు కలిసి అలా వస్తే....జగన్ వామపక్షాలతో ఇలా వచ్చారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: