ఎన్నికలు అయిపోయాక ఏపీలో నెంబర్ గేమ్ మొదలైనట్లుంది. ఐదు నెలల క్రితం వచ్చిన ఎన్నికల ఫలితాల ప్రకారం చూసుకుంటే రాష్ట్రంలో జగన్ నెంబర్ 1 స్థానంలో ఉన్నారు. ఇక చంద్రబాబు రెండో స్థానంలో ఉంటే....జనసేనాని పవన్ కల్యాణ్ మూడో స్థానంలో ఉన్నారు. ఇక బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు గురించి చర్చే లేదు. అయితే జగన్ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు దాటుతుంది. ఈ ఐదు నెలల కాలంలో జగన్ అమలు చేసిన నిర్ణయాలు, పథకాలు వల్ల ఆయనే టాప్ లో కొనసాగుతున్నారు.


అందులో ఎలాంటి అనుమానం లేదు. కాకపోతే నెంబర్ 2 విషయంపై అనుమానాలు కలుగుతున్నాయి. ప్రస్తుతానికైతే పార్టీ కేడర్, నాయకత్వం పరంగా చూసుకుంటే చంద్రబాబే ఉంటారు. కానీ ఒకే ఒక విషయం ఆలోచిస్తే స్థానాలు మారిపోయేలా కనిపిస్తోంది. ఆ విషయం ఏమిటంటే చంద్రబాబు వయసు. ఆయనకు ప్రస్తుతం 70 సంవత్సరాలు మహా అయితే మరో ఐదారు ఏళ్ళు రాజకీయాల్లో నిలబడతారు. అందులో ఐదేళ్లు ఇప్పుడు ప్రతిపక్షంలోనే పోతాయి.  


కానీ జగన్(46), పవన్ కల్యాణ్(48)లు ఇద్దరు నలభైల్లోనే ఉన్నారు. వీరికి ఇంకా రాజకీయ భవిష్యత్ చాలా ఉంది. జగన్ పరంగా చూసుకుంటే ఆయనకు తిరుగులేదు. మరో 30 ఏళ్ళు పైనే రాజకీయం చేయగలరు. అందులో సీఎంగా ఎక్కువ కాలం ఉండే అవకాశాలు కూడా బాగా ఉన్నాయి. అయితే చంద్రబాబుకు ఆ అవకాశం లేదు. ఇప్పుడు ఆ స్థానాన్ని పవన్ భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతానికి పవన్ కు పెద్దగా బలంగా లేకపోయిన రేపటి రోజున చంద్రబాబు రాజకీయాల్లో లేకపోతే టీడీపీలో నాయకత్వంలేమీ తప్పనిసరిగా ఉంటుంది. అదే గ్యాప్ ని పవన్ ఉపయోగించుకునే అవకాశం ఉంది.


ప్రజలు కూడా పవన్ వైపు మొగ్గుచూపే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా చంద్రబాబు కంటే పవన్ కే ఎక్కువ స్పందన వస్తుంది. ఆ విషయం ఇటీవల లాంగ్ మార్చ్ లో బాగా అర్ధమైంది. ఇక యూత్‌ను ఎట్రాక్ట్ చేసే విష‌యంలో జ‌గ‌న్ ముందు వ‌రుస‌లో ఉన్నారు. ఆ త‌ర్వాత బాబు కంటే ప‌వ‌నే ముందు వ‌రుస‌లో ఉన్నారు. ఈ యూత్ రేప‌టి నాయ‌కులు అవుతారు. ఇది బాబుకు బిగ్ మైన‌స్‌. ఏదిఏమైనా రానున్న రోజుల్లో నెంబర్లు మారడం ఖాయంగా కనిపిస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: