చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే సిద్దాంతాన్ని తూచా తప్పకుండా పాటించే తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇప్పుడు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ విషయంలో దాదాపుగా అదే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. వంశీని ఉన్నన్ని రోజులు ఇబ్బంది పెట్టిన తెలుగుదేశం నేతలు, ఇప్పుడు ఆయన వెళ్ళిపోతే అధినేత ఆదేశాలతో ఆపలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. దేవినేని ఉమా కారణంగా వంశీ పార్టీ నుంచి వెళ్లిపోతున్నారు అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజకీయంగా వంశీని ఇబ్బంది పెట్టింది ఆయనే.


దీనితో ఆయన్ను పూర్తిగా విభేదించే విజయవాడ ఎంపీ కేసినేని నానికి చంద్రబాబు... వంశీని ఆపే బాధ్యతను అప్పగించారు. నాని తో ఉన్న మంచి సంబంధాల కారణంగా ఆయన మాట వంశీ వింటున్నా పార్టీ మారితేనే భవిష్యత్తు అనే ఆలోచన బలంగా ఉండటంతో వంశీ... నాని విజ్ఞప్తిని అంగీకరించ లేకపోతున్నారు. ఇప్పుడు తెలుగుదేశానికి భవిష్యత్తు లేదనే విషయం వంశీకి అర్ధమైంది. దీనితో ఆయన వైసీపీకి వెళ్తేనే మంచిది అనే ఆలోచనలో ఉన్నారు.


ఇక చంద్రబాబు ఇప్పుడు ఆయన్ను పట్టుకుని వెళ్ళనీయకుండా ఆపుతున్నారని అంటున్నారు. హైదరాబాద్ వెళ్ళిన చంద్రబాబు వంశీ కి ఫోన్ చేసి ఒకసారి తన ఇంటికి రావాలని కోరారట. అయితే అందుకు వంశీ ఒప్పుకోకపోవడంతో చంద్రబాబు ఫోన్ లోనే మాట్లాడి నచ్చజెప్పే ప్రయత్నం చేసారు. అయినా సరే వంశీ మాత్రం ఉండటానికి ఇష్టపడలేదు. ఓ విధంగా చెప్పాలంటే వంశీని పార్టీ మార‌కుండా ఉండేందుకు బుజ్జ‌గింపులు, బ‌తిమిలాడ‌టాడు ఇలా ఓ రేంజ్‌లో వంశీకే చికాకు వ‌చ్చేలా టార్చ‌ర్ పెట్టేస్తున్నార‌ట‌.


ఇక సీఎం జ‌గ‌న్ యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, ఇంకా తనకు వయసు ఉండటంతో వంశీ పార్టీ మారడానికి మొగ్గు చూపుతున్నారు. నేను ఉండను వెళ్తాను అని గట్టిగా చెప్తున్నా సరే చంద్రబాబు మాత్రం వంశీని ఉండు ఉండు అంటూ వేపుకుని తింటున్నారు అంటూ ఆయన సన్నిహితులు అంగీకరిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: