“నెహ్రూ కూడా ఎన్నో సందర్భాల్లో ఇదే విషయాన్ని చెప్పారు. పిల్లలను పెంచడానికి తల్లి ఆకలితో గడిపే ఎన్నో సందర్భాలు ఉంటాయి. నేనూ పేద కుటుంబం నుంచే వచ్చాను. ఐదుగురు పిల్లలు తినడానికి అన్నం సరిపోకపోతే మాకు అన్నం పెట్టి మా అమ్మ నీళ్లు తాగి నిద్రించిన రోజులు ఉన్నాయి”  ఆర్టీసీ కార్మికుల సమస్యపై విచారణ సందర్భంగ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ తన తల్లి ప్రవర్తించిన తీరును ఉదహరించారు. ముఖ్యమంత్రి అనేవారు తన ప్రజల్ని కన్నబిడ్డల్లా భావించాలని ఉద్భోధించారు

“రాజుకు ప్రజలు పిల్లలతో సమానం. ధర్మశాస్త్రాలు ఇదే చెబుతున్నాయి. మన ఇతిహాసాలు చూడండి. ఆహారం కోసం ఒక చిన్న పావురాన్ని తన్నుకు పోవాలని గద్ధ ప్రయత్నించి నప్పుడు అది శిబి చక్రవర్తి దగ్గరకు వెళ్లి ప్రాణాలు కాపాడాలని కోరింది. వెంటనే, ఆ చిన్న పక్షిని వదిలి పెట్టాలని, దానికి బదులుగా తన శరీరంలోని కండరాలను కోసి ఇవ్వడానికి చక్రవర్తి సిద్ధ పడతాడు. పురాణ గాథలు చూడండి. విష్ణువు ఎంతటి గొప్పవాడు. తాను తలచుకుంటే ఏమైనా చేయగలడు. అయినా, ఒక మహర్షి ఆగ్రహిస్తే సహనం వహించాడు. ఆయన కాలిని తన తలపై పెట్టుకున్నాడు. పెద్దరికం ఉండాలి ప్రదర్శించాలి. ముందుగా పెద్దలే తగ్గాలి”

Image result for telangana high court bench with CJ comments on cm KCR

అధికారులు ఉన్నత న్యాయస్థానానికి తప్పుడు సమాచారం ఇచ్చారని  ‘‘తప్పుడు లెక్కలు చెప్పడం సరి కాదు. లెక్కల గందరగోళం పై సీఎం కేసీఆర్‌ ప్రశ్నించలేదా!?’’ అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి &  జస్టిస్‌ ఎ.అభిషేక్‌ రెడ్డితో కూడిన ధర్మాసనం నిలదీసింది.

“ఆర్టీసీ కార్మికుల సమస్యపై ప్రభుత్వం ఇంత మంకు పట్టు పడుతుందని మేం భావించలేదు. అధికారులైనా, న్యాయవ్యవస్థ అయినా ప్రజల కోసమే పని చేస్తాయి. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం ఒకవైపు, ట్రేడ్‌ యూనియన్లు మరో వైపు మొండి పట్టు పడుతున్నారు. దేనికైనా పట్టువిడుపులు ఉండాలి. మీ మధ్య పోరులో కోట్లాది మంది ప్రజలు అవస్థలు పడుతున్నారనే విషయం గమనించాలి”  అని సీజే చౌహాన్‌ హితవు పలికారు.

Image result for telangana high court bench with CJ comments on cm KCR

"రైతులకు కేంద్ర ప్రభుత్వం ₹ 2000/- ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ₹ 4000/- ఇస్తోంది. ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తోంది. కానీ, ఆర్టీసీ విషయంలో ఎందుకింత మంకు పట్టు పడుతోంది? వందలు, వేల కోట్లు సంక్షేమ కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఆర్టీసీ సమ్మె వల్ల ప్రజలు పడుతున్న కష్టాలను గుర్తించకపోవడం విస్మయం కలిగిస్తోంది"

ఆర్టీసీ సమ్మె పరిష్కారం దిశగా అడుగులు వేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. మంకు పట్టు తగదని హితవు పలికింది. ప్రజలను కష్టనష్టాల నుంచి గట్టెక్కించడమే ప్రజా నాయకుల, ప్రభుత్వాధినేతల లక్ష్యం కావాలని హితవు పలికింది.

మరింత సమాచారం తెలుసుకోండి: