తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ భవిష్యత్తు ఏంటి...? ఈ ప్రశ్నకు సమాధానం మాత్రం దొరకడం లేదు. ఎక్కడో గుడివాడ నుంచి ఆయన్ను పోటి చేయించిన అధిష్టానం ఇప్పుడు చుక్కలు చూపిస్తుంది అనే అభిప్రాయం పార్టీ కార్యకర్తల్లో వ్యక్తమవుతుంది. కృష్ణా జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా దేవినేని కుటుంబానికి అభిమానులు ఉన్నారు. వారందరూ కూడా అవినాష్ రాజకీయ భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయన కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి వచ్చినప్పుడు ఆయన్ను నమ్మి పార్టీలోకి వచ్చారు కొందరు స్థానిక నాయకులు.


ఇప్పుడు అవినాష్ రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది వారికి సైతం అర్ధం కావడం లేదు. గుడివాడ అవినాష్ ని పంపినప్పుడు పెనమలూరు ఇస్తే బాగుండేది అని అభిప్రాయ పడిన వారిలో వారు కూడా ఉన్నారు. అక్కడ చేతి చమురు వదిలిన తర్వాత విజయవాడ వచ్చిన అవినాష్ ఇప్పుడు అక్కడ నానీని ఎదుర్కొని నిలబడే పరిస్థితి లేదు. ఈ విషయం అర్ధమైన ఆయన... ప్రస్తుతం పెనమలూరు గాని విజయవాడ తూర్పు సీటు గాని తీసుకునే ఆలోచనలో ఉన్నారు. గద్దె కుటుంబాన్ని గన్నవరం పంపిస్తే తాను విజయవాడ తూర్పులో ఉంటానని అంటున్నారట.


కాని అవినాష్ కి లోకేష్ నుంచి గాని చంద్రబాబు నుంచి గాని ఏ విధమైన స్పష్టతా రావడం లేదు. ఆయన తన రాజకీయ భవిష్యత్తు విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో అర్ధం కాక విసిగిపోయారని అంటున్నారు. ఇప్పుడు గన్నవర౦ నుంచి పోటీ చేస్తే తనకు నష్టం, ఆర్ధిక ఇబ్బందులు మినహా ఏమీ ఉండవు అనే భావనలో అవినాష్ ఉన్నారు. ఆయన తాజాగా లోకేష్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కూడా తనకు పెనమలూరు ఇస్తామని చంద్రబాబు చెప్పారని ఇప్పుడు గన్నవరం అంటే తాను వెళ్ళే పరిస్థితిలో లేనని లోకేష్ కి స్పష్టంగా చెప్పారట.


మరింత సమాచారం తెలుసుకోండి: