భారత్ సంచార్ నిగం లిమిటెడ్‌కు చెందిన ప్రభుత్వ రంగంలోని 50,000 మంది ఉద్యోగులు గత మూడు రోజుల్లో ఇప్పటికే స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని ఎంచుకున్నారు, రాబోయే రోజుల్లో ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు శుక్రవారం తెలిపారు."83,000 మంది ఉద్యోగులు వీఆర్ఎస్ ప్యాకేజీని పొందాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము" అని బిఎస్ఎన్ఎల్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ పి.కె. పూర్వర్ న్యూ న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో విలేకరులతో అయన అన్నారు.


బిఎస్ఎన్ఎల్ కంపెనీ లో మొత్తం 1.5 లక్షల మంది ఉద్యోగులలో, దాదాపు లక్ష మంది VRS కి అర్హులు.ఈ పథకం నవంబర్ 5 నుంచి డిసెంబర్ 3 వరకు తెరిచి ఉంటుంది.బిఎస్ఎన్ఎల్ లో ఉన్న అన్ని రెగ్యులర్,శాశ్వత ఉద్యోగులు ఇతర సంస్థకు డిప్యుటేషన్ ఉన్నవారు లేదా బిఎస్ఎన్ఎల్ వెలుపల డిప్యుటేషన్ ప్రాతిపదికన పోస్ట్ చేయబడినవారు, 50 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు పొందిన వారు ఈ పథకం కింద స్వచ్ఛంద పదవీ విరమణ పొందటానికి అర్హులు అని సంస్థ తెలిపింది.

అర్హులైన ఉద్యోగులకు సర్వీసు పూర్తిచేసిన కాలానికి ఏడాదికి 35 రోజుల వేతనం అలాగే మిగిలిన సర్వీసు కాలానికి ప్రతి ఏడాదికి 25 రోజుల వేత నాన్ని లెక్క గట్టి చెల్లిస్తామని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.బిఎస్‌ఎన్‌ఎల్, ఎమ్‌టిఎన్‌ఎల్‌ల కోసం 69,000 కోట్ల రూపాయల పునరుద్ధరణ ప్యాకేజీని కేబినెట్ గత నెలలో ఆమోదించింది. ఈ రెండు ఆపరేటర్లు కూడా విలీనం అవుతాయి.


ఈ ప్యాకేజీలో 4జి స్పెక్ట్రం కొనుగోలుకు 20,140 కోట్లు,స్పెక్ట్రం కేటాయింపుపై జీఎస్టీకి 3,674 కోట్లు, సార్వభౌమ హామీపై 15,000 కోట్ల అప్పులు, ప్రభుత్వ నిధులు 17,160 కోట్లు, వీఆర్‌ఎస్‌కు మరో 12,768 కోట్లు పదవీ విరమణ బాధ్యతకు వాడుకుంటారు అని తెలుస్తుంది


మరింత సమాచారం తెలుసుకోండి: