రాష్ట్రాన్ని ప‌రిపాలిస్తున్న నేత, పార్టీ అధినేత ఆలోచ‌న‌ను గ్ర‌హించి...సామాజిక హితం కోసం త‌క్ష‌ణ‌మే ముందుకు న‌డిచే గుణం కొంద‌రిలో ఉంటుంది. అలా..వైసీపీ అధినేత‌, ముఖ్యమంత్రి వైయస్‌.జగన్ ఆలోచ‌న‌కు త‌క్ష‌ణ‌మే స్పందించి....అంద‌రి కంటే ముందు ఆ మంచి కార్య‌క్ర‌మం కోసం న‌డుం క‌ట్టిన ఎమ్మెల్యేగా మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆర్కే వార్త‌ల్లోకి ఎక్కారు. సీఎస్‌ఆర్‌ నిధులు, దాతలు, సంస్థలు, ప్రవాసాంధ్రులనుంచి వచ్చే సహాయం కోసం వైబ్‌సైట్ ప్రారంభించాల‌ని డిసైడ‌యింది. శుక్ర‌వారం సాయంత్రం `కనెక్ట్‌ టు ఆంధ్రా వెబ్‌ పోర్టల్‌`ను ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్ ఆవిష్కరించారు. అయితే, ఈ కార్య‌క్ర‌మానికంటే..ముందే ఎమ్మెల్యే ఆర్కే త‌న వేత‌నం మొత్తం అందించారు.


శుక్ర‌వారం రాత్రి సచివాలయంలోని తన కార్యాలయంలో ``కనెక్ట్‌ టు ఆంధ్రా వెబ్‌ పోర్టల్‌``ను ముఖ్యమంత్రి వైయస్‌.జగన్ ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా, సీఎస్‌ వైస్‌ ఛైర్మన్‌గా ‘‘కనెక్ట్‌  టు ఆంధ్రా’’ ప‌నిచేయ‌నుంది. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మాట్లాడుతూ....ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల్లో భాగస్వామ్యం కోసం ముందుకు రావాల‌ని పిలుపునిచ్చారు. సొంత గ్రామంలో అమలవుతున్న నవరత్నాలు, నాడు–నేడు సహా, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు ఎవరైనా సహాయం చేయొచ్చున‌ని సీఎం తెలిపారు. క‌నెక్ట్‌ టు ఆంధ్రా వెబ్‌ ప్రారంభం తర్వాత ప్రవాస ఆంధ్రులను ఉద్దేశించి సందేశం ఇచ్చిన ముఖ్యమంత్రి  ‘‘రాష్ట్రం మీద మీ ప్రేమాభిమానాలు చూపించడానికి ఇదొక మంచి అవకాశం`` అని తెలిపారు.


``మీరు ఎంత సహాయం చేస్తారన్నది ముఖ్యంకాదు, మీ గ్రామానికి లేదా మీ నియోజకవర్గానికి లేదా మీ జిల్లాలో మీరు ఏ కార్యక్రమైనా చేపట్టవచ్చు. లేదా ఏ కార్యక్రమానికైనా ఎంత మొత్తమైనా సహాయం చేయవచ్చు. మెరుగైన రాష్ట్రం కోసం మీరు ఎంతోకొంత మంచిచేయడానికి ఖండాతరాల్లో ఉన్న వారంతా ముందుకు రావాలి’’అని కోరారు. ఈ కార్యక్రమంలో  మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ విజయ్‌కుమార్, ప్రణాళికా శాఖ డిప్యూటీ సెక్రటరీ కోటేశ్వరమ్మ, ఏపీఎన్‌ఆర్టీ ఛైర్మన్‌ మేడపాటి వెంకట్‌ పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: