ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవడానికి వెనకాడటం లేదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక్కో  హామీని నెరవేరుస్తూ వస్తున్నారు . అంతే కాకుండా రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశపెడుతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలోనే జగన్ సర్కార్ ఓ కొత్త వెబ్ సైట్ ను ప్రారంభించింది. కనెక్ట్ టు ఆంధ్ర పేరుతో ఓ వెబ్ సైట్ ను తీసుకువచ్చారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆంధ్ర ప్రదేశ్లో ప్రభుత్వ పథకాలకు సాయం చేయాలనుకునే కంపెనీలు వ్యక్తులు సంస్థలు ఎన్నారైలు ఈ వెబ్సైట్ ద్వారా సహాయం చేయవచ్చు అంటూ తెలిపింది జగన్ సర్కార్. రాష్ట్రమే మీద  మీ ప్రేమాభిమానాలు చూపించడానికి ఇదొక మంచి అవకాశం అని  సూచించింది. 



 మీరు చేసే సాయం మీ గ్రామానికి లేదా నియోజకవర్గానికి లేదా జిల్లా అభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు. ఎంత మొత్తాన్నైనా  సహాయం చేయొచ్చు అంటూ సూచించారు. కనెక్ట్ టు ఆంధ్ర వెబ్ సైట్ లో  రాష్ట్ర అభివృద్ధికి సహాయం చేయడానికి అందరూ ముందుకు రావాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. కాగా  తమ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు తో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి స్పందించారు. తనకు ఎమ్మెల్యేగా అసెంబ్లీ నుంచి వచ్చే జీతభత్యాలు మొత్తం కనెక్ట్ టూ  ఆంధ్రాకు డొనేట్  చేస్తున్నట్లు ప్రకటించారు ఆయన . ఈ మేరకు అంగీకార పత్రాన్ని తెలియజేస్తూ ఏపీ అసెంబ్లీ కార్యదర్శికి లేఖ సమర్పించారు. అసెంబ్లీ నుంచి తన ఐదేళ్ల కాలానికి పొందే మొత్తం జీతభత్యాలను కనెక్ట్ టూ  ఆంధ్రా కు బదిలీ చేయాలనీ  ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కోరారు. 



 2019 నవంబర్ నుంచి ఎమ్మెల్యేగా తన పదవీకాలం పూర్తి అయ్యే వరకు వచ్చే వేతనాలు కనెక్టు టూ  ఆంధ్రాకు ఇవ్వాలని అనుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం మే  30 నుంచి ప్రారంభం కాగా... ఇప్పటివరకు ఐదు నెలలు పూర్తి అయ్యాయి ఇంకో 55 నెలల పదవీకాలం మిగిలి ఉండి . అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ ఎమ్మెల్యే కు మొత్తంగా  కలిపి నెలకు 1.95 లక్షల వరకు జీత భత్యాలు వస్తాయి...  అంటే యాభై ఐదు నెలల కాలానికి వచ్చే జీతం మొత్తం కలిపి కోటి రూపాయల వరకు వస్తాయి . కాగా  ఈ మొత్తాన్ని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కనెక్ట్ టు ఆంధ్ర డొనేట్  చేయడం నిజంగా హర్షించదగ్గ విషయమే.


మరింత సమాచారం తెలుసుకోండి: