తెలంగాణ ఆర్టీసీ స‌మ్మె ఉధృత రూపం దాల్చుతోంది. ఇప్ప‌టికే 35 రోజులుగా జ‌రుగుతున్న స‌మ్మెలో కీల‌క ప‌రిణామంగా...నేడు న‌వంబ‌ర్ 9 ఆర్టీసీ జేఏసీ మిలియన్ మార్చ్ తలపెట్టిన సంగ‌తి తెలిసిందే. ఆర్టీసీ జేఏసీ చ‌లో ట్యాంక్ బండ్ నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ నేతల అరెస్టులు కొనసాగుతున్నాయి. మ‌రోవైపు....స‌మ్మెకు సంఘీభావం తెలిపే వారి సంఖ్య‌ సైతం పెరుగుతోంది. అన్ని ప్ర‌ధాన పార్టీలు మ‌ద్ద‌తు తెలుపుతున్నాయి. ఆర్టీసీ జేఏసీ తల పెట్టిన మిలియన్ మార్చ్ కు తమ మద్దతు ఉంటుందని తెలిపారు ఆటో డ్రైవర్స్ జేఏసీ తెలిపింది.


ఛ‌లో ట్యాంక్‌బండ్ నేప‌థ్యంలో... హైదరాబాద్ తోపాటు జిల్లాల్లోనూ ఆర్టీసీ జేఏసీ నేతలు, కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. కొందరు కార్మికుల ఇళ్లలోకి వెళ్లి మరీ అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. కార్మిక జేఏసీ నేత రాజిరెడ్డిని సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర నంబర్ ప్లేట్ ఉన్న వాహనంలో వచ్చిన టాస్క్ ఫోర్స్ పోలీసులు బలవంతంగా ఆయనను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అరెస్టులపై జేఏసీ నేతలు మండిపడుతున్నారు. యూనివర్సిటీల్లోనూ విద్యార్థి సంఘాల నేతలను అరెస్ట్ చేస్తున్నారని...ఇదేం దారుణ‌మ‌ని ప్ర‌శ్నిస్తున్నారు.


ఇదిలాఉండ‌గా, ఆర్టీసీ మిలియన్ మార్చ్ కు ఆటో జేఏసీ మద్దతు ఇచ్చింది. ఆదివారం ట్యాంక్ బండ్ పై జరుగనున్న మిలియన్ మార్చ్ కు ఆటో డ్రైవర్లందరూ తరలి రావాలని ఆటో డ్రైవర్స్ జేఏసీ కన్వీనర్ అమణుల్లా ఖాన్ పిలుపునిచ్చారు. ఆర్టీసీ కార్మికులకు మిగితా యూనియన్లు దూరంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఉచిత సలహాలు ఇస్తున్నారని అన్నారు. కార్మికులను యూనియన్లను దూరం చేస్తే పిల్లలను తల్లిదండ్రులకు దూరం చేసినట్లేనని చెప్పారు. ఆర్టీసీ జేఏసీ తల పెట్టిన మిలియన్ మార్చ్ కు తమ మద్దతు ఉంటుందని తెలిపారు.ఆర్టీసీ కార్మికుల కోసం పోరాటం చేస్తున్న జేఏసీ కన్వీనర్ కు ఆర్టీసీ కార్మిక పోరాట రత్న బిరుదును త్వరలో ఇస్తామని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: