డేటింగ్ సైట్ల ముసుగులో యువకులకు వల వేస్తున్న హనీ ట్రాప్ లో సాధారణ యువకులు పడితే డబ్బు పోతుంది, కానీ ఇలాంటి ట్రాప్ లో దేశ సైనికులు పడితే మాత్రం మన దేశానికే ముప్పు వాటిల్లితుంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత నుంచి ఏ అవకాశం దొరికినా వదలకుండా మన ఆర్మీపై చెలరేగుతున్న పాక్ ఎంత నీచానికైనా దిగజారడానికి ఆలోచించట్లేదు.   


పాకిస్థాన్ రోజురోజుకి మోసపూరితమైన దారులు తొక్కుతూ ఎలాగైనా మన ఇండియా ఆర్మీను మట్టుబెట్టాలని చూస్తోంది. ఒకపక్క  సోషల్ మీడియాలో ద్వారా న్యూసెన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆన్లైన్ వేధిక గా జరిగే మోసాలకు అడ్డు ఆపు లేకుండా పోతుంది. ఇప్పుడు దాన్నే ఆయుధంగా ఉపయోగిస్తూ.. ఆర్మీ రహస్యాలను దొంగిలించడం కోసం.. మన సైనికులకు అమ్మాయిల ముసుగుతో వల విసురుతోంది.


అమ్మాయిల పేరుతో ఫేక్ సోషల్ మీడియా ప్రొఫైల్స్ క్రియేట్ చేసి.. జవాన్లను ముగ్గులోకి దింపి కూపీ లాగుతున్నట్లు తెలుస్తోంది. అమ్మాయిల వలలో పడని వాళ్ళకు బాబాల ముసుగులో నమ్మించి ట్రాప్ చేస్తున్నారట. ఇక ఈ మధ్యకాలంలో ఇటువంటి సంఘటనలు ఎక్కువైపోవడంతో ఇండియన్ ఆర్మీ అప్రమత్తమైంది. తమ జవాన్లకు పాకిస్థాన్ నుంచి ఆపరేట్ అవుతున్న 150 ఫేక్ సోషల్ మీడియా ప్రొఫైల్స్‌కు దూరంగా ఉండాలంటూ సూచనలు చెప్పింది.


ఇక తాజాగా రాజస్థాన్‌లో పాకిస్థాన్ హానీ ట్రాప్ వలలో చిక్కుకున్న ఇద్దరు ఆర్మీ జవాన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. పాక్ ఐఎస్ఐకి ఆర్మీ బేస్ సీక్రెట్స్ అన్ని ఫేస్‌బుక్, వాట్సాప్ ద్వారా అందిస్తున్నారని పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు. అలాగే గతంలో కూడా ఈ హానీ ట్రాప్‌కు పలువురు జవాన్లు, ఎయిర్ ఫోర్స్ అధికారులు కూడా చిక్కారని.. ఇప్పటికైనా జవాన్లు అప్రమత్తం కావాలని ఇండియన్ ఆర్మీ హెచ్చిరిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: