ఆర్టీసీ కార్మికుల చలో ట్యాంక్‌బండ్ నేప‌థ్యంలో....హైద‌రాబాద్ స‌హా తెలంగాణ వ్యాప్తంగా ప‌రిణామాలు మారుతున్నాయి. ఓవైపు ఆర్టీసీ జేఏసీ స‌మ్మె విజ‌యవంతానికి కృషి చేస్తుంటే...మ‌రోవైపు ప్ర‌భుత్వం ముంద‌స్తు అరెస్టులు చేస్తోంది. కాగా, హైద‌రాబాద్‌లో ఆర్టీసీ కార్మికులు స‌మ్మెకు పిలుపునిచ్చిన నేప‌థ్యంలో....ట్రాఫిక్ ఆంక్షలు అమ‌లులోకి వ‌చ్చాయి. హైదరాబాద్ అడిషనల్ ట్రాఫిక్ కమిషనర్ ఈ మేర‌కు వివ‌రాలు వెల్ల‌డించారు. ఆర్టీసీ కార్మికుల‌ చలో ట్యాంక్ బండ్ సందర్భంగా ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయ‌ని స్ప‌ష్టం చేశారు.


ట్యాంక్ బండ్ వైపు వచ్చే రూట్లను మళ్లించినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్ల‌డించారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్యాంక్ బండ్ పై రాకపోకలు బంద్ చేశామ‌ని తెలిపారు. సికింద్రాబాద్ నుంచి ట్యాంక్ వచ్చే రూట్ ని కవాడిగుడా వైపు మల్లించామ‌ని వెల్ల‌డించారు. ఆర్టీసీ క్రాస్ నుంచి ఇందిరా పార్కు వచ్చే వాహనాలు అశోక్ నగర్ నుంచి మళ్లించిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు వెళ్లే వాళ్ళు ప్ర‌త్యామ్నాయ‌ దారి చూసుకొని వెళ్లాలని పోలీసు అధికారులు సూచించారు. హిమాయత్ నగర్ దగ్గర నుంచి ట్యాంక్ బండ్ వచ్చే వాళ్ళు బషీర్ బాగ్ వైపు మ‌ళ్లీ వెళ్లాల‌ని కోరారు.


ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్ట‌ర్స్‌ రూట్ నుంచి వచ్చే వాహనదారులు పిసిఆర్ జంక్షన్ దగ్గర దారి మళ్లించుకోవాల‌ని హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఖైరతాబాద్ నుంచి ట్యాంక్ బండ్ వచ్చే వాహనదారులు ఇందిరా గాంధీ విగ్రహం దగ్గర నెక్లెస్ రోడ్ మ‌రియు మింట్ కంఫౌండ్‌ వైపు వెళ్లాల‌ని పోలీసు అధికారులు కోరారు.ట్రాఫిక్ పోలీస్ సూచించిన దార్లలో వాహనదారులు వెళ్లగలరని పోలీసులు ఈ సంద‌ర్భంగా కోరారు. ట్రాఫిక్ రద్దీ దృశ్యా పోలీసులకు వాహనదారులు పోలీసులకు సహకరించగలరని విజ్ఞ‌ప్తి చేశారు.హైదరాబాద్‌లో జ‌ర్నీ చేసేవారు ఈ మేర‌కు త‌మ ప్ర‌యాణాన్ని మార్చుకోవాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: