కేంద్ర పెట్రోలియం, ఉక్కు శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, నేడు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా విజయవాడకు చేరుకునే ఆయన, తొలుత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సమావేశమయ్యారు. ఆయనతో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కేంద్ర మంత్రి ప్రస్తావించినట్టు తెలుస్తోంది.


కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాష్ట్ర పర్యటనకు వచ్చారంటూ జగన్.. తనకు కోర్టు నుంచి మినహాయింపు కోరారు. అందుకు న్యాయస్థానం సమ్మతించి కోర్టు హాజరు నుంచి ఒకరోజు మినహాయింపు ఇచ్చింది. దీంతోజగన్‌ కోర్టుకు వెళ్లలేదు.   జగన్‌మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో శుక్రవారం ఉదయం 11.30గంటలకు భేటీ అయ్యారు. ఈ భేటీలో కడప ఉక్కు ఫ్యాక్టరీతోపాటు రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది.

కడప స్టీల్‌ ప్లాంట్‌కు సంబంధించి ఇనుప ఖనిజాల సరఫారపై ప్రధనంగా చర్చించారు. దీనికి సంబంధించి త్వరలో ఎన్‌ఎమ్‌డీసీ, ఏపీ ప్రభుత్వం మద్య ఎంఓయూ జరగనుంది. చమురు కంపెనీలకు రాష్ట్రంలో వనరుల ఆదాయాల మేరకు సీఎస్‌ఆర్‌ నిధులు చెల్లించాలని ఈ భేటీలో నిర్ణయించారు. తూర్పు గోదావరిలోని ముమ్మిడివరం ప్రాంతంలో మత్య్సకారులకు చెల్లించాల్సిన 81 కోట్ల రూపాయలను త్వరలో చెల్లిస్తామని ఈ సందర్భంగా ఓఎన్‌జీసీ అంగీకరించింది.

ఆపై రాజమండ్రికి చేరుకుని, నాగాయలంక ప్రాంతంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసారు.అనంతరం   కార్యకర్తలు, స్థానిక నేతలతో సమావేశమయ్యారు. ధర్మేంద్ర ప్రధాన్ రాకను పురస్కరించుకుని, బీజేపీ శ్రేణులు రాజమండ్రి, నాగాయలంక పరిసరాలల్లో స్వాగతం పలుకులతో ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. మరోవైపు రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రవాసాంధ్రుల నుంచి వచ్చే సహాయం కొరకు ఏర్పాటు చేసిన కనెక్ట్‌ టూ ఆంధ్రా వెబ్‌ పోర్టల్‌ను సీఎం జగన్‌ ఆవిష్కరించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో ఈ వెబ్‌పోర్టల్‌ను సీఎం ప్రారంభించారు. దాతలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రవాసాంధ్రుల నుంచి వచ్చే సహాయం కోసం ఈ వెబ్‌సైట్‌ను రూపొందించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: