ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారం కాకుండా వివాదాస్పదంగా ఉన్న అయోధ్య రామ్ జన్మభూమి, బాబ్రీ మసీద్ కేసుకు సంబంధించిన తుది తీర్పు రేపు వెలువడబోతున్నది.  దీంతో అయోధ్యలో టెన్షన్ వాతావరణం నెలకొన్నది.  ఒక్క అయోధ్యలోని కాదు, యుపి మొత్తం ఈ రాత్రి ఎలా గడుస్తుందా అని ఎదురు చూస్తున్నారు.  ఈ ఉదయం సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ యూపీ అధికారులతో మాట్లాడి అక్కడి భద్రత విషయం గురించి చర్చించారు.  


యూపీ అధికారులతో ఈ ఉదయం జరిగిన భేటీలో సుప్రీం కోర్టు చీఫ్ జుస్టిక్ తో పాటుగా ఇతర న్యాయమూర్తులు కూడా పాల్గొన్నారు.  భద్రత విషయంలో అంతా సక్రమంగా ఉన్నది అని అనుకున్న తరువాతే ఈ కేసుకు సంబంధించిన తేదీని రిలీజ్ చేశారు.  రేపు ఉదయం 10:30 గంటలకు సుప్రీమ్ కోర్టు తీర్పును వెలువరించబోతున్నది.  ముందు ఐదుగురు జడ్జిలు తమ జడ్జిమెంట్ ను చదువుతారు.  ఐదుగురిలో ఎవరి తీర్పు మెజారిటీ వైపు ఉంటుందో దాన్ని ఫైనల్ తీర్పుగా వెలువరించే అవకాశం ఉంటుంది.  


గత కొన్ని రోజులుగా అయోధ్యలో 144 సెక్షన్ ను అమలు చేశారు. ప్రస్తుతం అక్కడ నాలుగు అంచెల భద్రతను ఏర్పాటు చేశారు.  ఈ భద్రత మధ్య అయోధ్య ఉన్నది.  సోషల్ మీడియాపై కూడా నిఘా పెట్టారు.  సోషల్ మీడియా నిఘా కోసం ఏకంగా 16వేలమంది వాలంటీర్లను నియమించింది ప్రభుత్వం.  ఈ కేసు కోసం ప్రత్యేక బెంచ్ ను ఏర్పాటు చేసి దాదాపు 40 రోజులపాటు వాదాలను విన్నది సుప్రీం కోర్టు.   అక్టోబర్ 16 వ తేదీన ఈ కేసును సంబంధించిన తీర్పును రిజర్వ్ చేసింది. ఈనెల 17 వ తేదీలోగా జడ్జిమెంట్ ను వెల్లడించాలి.  అయితే, దానికంటే ముందుగానే రేపు ఉదయం జడ్జిమెంట్ ను ప్రకటించబోతున్నది.  

ఈనెల 17 వ తేదీన చీఫ్ జస్టిస్ రంజన్ గోగోయి రిటైర్ కాబోతున్న తరుణంలో... ఈ కేసును సీరియస్ గా తీసుకొని పదవీ విరమణ చేసే కంటే ముందుగానే ఈ కేసులో తీర్పు చెప్పాలని అనుకున్నారు.  మొదట సోమవారం కానీ, మంగళవారం కానీ తీర్పు వెలువడే అవకాశం ఉందని అనుకున్నారు.  కానీ, అందరికి షాక్ ఇస్తూ శనివారం రోజున తీర్పును వెలువరించబోతున్నది సుప్రీం కోర్టు.  


మరింత సమాచారం తెలుసుకోండి: