ఏపీ సీఎం గా బాధ్యతలు స్వీకరించిన జగన్ తన హామీలను నెరవేర్చేందుకు ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారు. సంకల్పం గట్టిదైతే అన్ని శుభాలే జరుగుతాయి అని అంటారు. జగన్ ఇపుడు అటువంటి  పట్టుదల పట్టారు. తాను ఇచ్చిన నవరత్నాల హామీలను సవ్యంగా నెరవేర్చాలన్నది ఆయన ఆశయం. తాను అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలను సకాలంలో తీర్చి మరీ వచ్చే ఎన్నికలకు వెళ్తానని కూడా జగన్ ఎన్నికల సభల్లో  చెప్పడం జరిగింది.


అయితే ఏపీ పరిస్థితులు చూస్తే ఆర్ధికంగా లోటుతో ఉంది. నిధులు ఎక్కడా సరిపోని వాతావరణం కనిపిస్తోంది. ఓ వైపు ఏపీలో  సరైన పెద్ద నగరం లేదు. కేంద్ర సాయం కూడా అందడం లేదు. ప్రతిపక్షాల నుంచి ఎన్నో సవాళ్ళు ఎదురవుతున్నాయి.  తొంబై  తొమ్మిది పనులు చేసినా కూడా నూరో తప్పుని వెతికి పట్టుకోవాలని అవి చూస్తున్నాయి. ఈ  నేపధ్యంలో జగన్ ఎట్టి పరిస్థితుల్లో నవరత్నాలు కచ్చితంగా అమలు చేయాలనుకుంటున్నారు. అందుకోసం కనెక్ట్ టు ఆంధ్ర పేరిట వినూత్న పధకాన్ని ప్రవేశపెట్టారు. దానికి సంబంధించిన వెబ్ పొర్టల్ ని ఆవిష్కరించారు.  ప్రవాస భారతీయులు, స్వచ్చంద సంస్థ ప్రతినిధులు, సమాజ సేవా సంస్థలు, ధనవంతులు, రాజ‌పోషకులు ఇలా అందరూ కనెక్ట్ టు ఆంధ్ర వెబ్ సైట్ ని సంప్రదించి తమకు తోచిన ఆర్ధిక సాయం చేయవచ్చునన్నది పధకం ఉద్దేశ్యం.


ఆంధ్రులను ఆదుకోవాలని, సొంత గడ్డ రుణం తీర్చుకోవాలని జగన్ కోరుతున్నారు. సొంత గ్రామాన్ని, జిల్లాని, నియోజకవర్గాన్ని పాఠశాలను ఇలా దేన్ని దత్తత  అయినా తీసుకుని అభివ్రుధ్ధి చేయవచ్చు. లేదా నిధులు పంపవచ్చు. వారి పేరు మీదనే ఆ అభివ్రుధ్ధి చేస్తామని కూడా జగన్ చెబుతున్నారు. ఇది  జగన్ చేస్తున్న విన్నపం. నిజంగా మంచి కార్యక్రమం కోసం ఇస్తున్న ఈ పిలుపు  ఏపీ కొత్త జీవితానికి మేలి మలుపు అవుతుందని అందరూ భావిస్తున్నారు. కాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్ రామక్రిష్ణారెడ్డి తన 55 నెలల జీతాన్ని కనెక్ట్ టు ఆధ్రా పధకానికి విరాళంగా ఇచ్చారు. ఇది నిజంగా వైసీపీ ఎమ్మెలేలతో పాటు అందరికీ స్పూర్తిగా ఉంటుంది. రానున్న కాలంలో మరెంత మంది ఇస్తారో చూడాలి. ఇక జగన్ సర్కార్ ఈ ఆర్ధిక సంవత్స‌రానికి వేయి కోట్ల రూపాయలు ఫండ్ రైజ్ చేయాలని నిర్ణయించింది. మరి చూడాలి ఇది ఎంతవరకూ పరుగులు తీస్తుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: