టీడీపీ అధినేత చంద్రబాబుకు వైద్యపరీక్షలు చేయిచాలా.. ఇప్పుడు ఆయన ఆరోగ్యానికి వచ్చిన నష్టమేంటి.. అందులోనూ ఆయన ఆరోగ్యం కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మితాహారం తీసుకుని జిమ్ చేస్తారు. క్రమశిక్షణ కలిగిన దిన చర్య ఆయనదని తెలుగు దేశం నాయకులు చెబుతుంటారు. మరి ఆయనకు వైద్య పరీక్షలు ఎందుకు అంటారా..?


చంద్రబాబు మానసిక పరిస్థితి సరిగా లేదట.. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారట. అధికారులను బెదిరిస్తున్నారట. ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు.. సాక్షాత్తూ ఆంధ్రప్రదేశ్ హోంశాఖామంత్రి సుచరిత. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు వైద్య పరీక్షలు చేయించాలని మంత్రి సుచరిత సూచించారు.


వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం అగ్రిగోల్డ్‌ బాధితులకు డబ్బులు చెల్లించారని, వారి కళ్లల్లో ఆనందం కనిపిస్తుందని మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో బాధితులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, ఆస్తులు కాజేసేందుకు కుట్రలు చేశారని విమర్శించారు. 2019 వరకు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు అగ్రిగోల్డ్‌ బాధితులకు ఒక్కపైసా కూడా చెల్లించకుండా అన్యాయం చేశారన్నారు.


ఆ రోజు న్యాయం చేశామని, ఈ రోజు ప్రభుత్వం అన్యాయం చేస్తున్నట్లు టీడీపీ నేతలు విమర్శించడం సిగ్గుచేటు అన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆ రోజు పాదయాత్రలో అగ్రిగోల్డ్‌ బాధితులకు ఇచ్చిన మాట కోసం మొదటి కేబినెట్‌ సమావేశంలోనే రూ.1150 కోట్లు కేటాయిస్తూ తీర్మానం చేశార్ననారు. మొదటి విడతగా రూ.264 కోట్లు విడదల చేసి రూ.10 వేల లోపు డిపాజిటర్లకు డబ్బులు ఇచ్చారన్నారు.


చంద్రబాబు డీజీపీని పట్టుకుని ఇష్టారాజ్యంగా మాట్లాడటం దారుణమన్నారు. మొన్నటి వరకు పల్నాడులో అరాచకాలు జరుగుతున్నాయని గగ్గొలు పెట్టారని మంత్రి సుచరిత అన్నారు. హ్యుమన్‌ రైట్స్‌ కమిషన్‌ వచ్చి పల్నాడు ప్రశాంతంగా ఉందని రిపోర్టు ఇచ్చిందన్నారు. ఖాకీ చొక్కాలు వేసుకున్న పోలీసులకే గత ప్రభుత్వం తోడ్పాటునందించిందని, ఈ రోజు అందరికీ మా ప్రభుత్వం సమాన గౌరవం ఇస్తుందని మంత్రి సుచరిత అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: