వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ నిర్ణయం ఎందరో బడుగు జీవుల కళ్లలో ఆనందం నింపింది. ఇక తమ పిల్లలు కూడా ఇంగ్లీషు చదువులు చదవుకుంటారని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ మరోవైపు కొందరు మాత్రం బాషాభిమానం ముసుగులో ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జగన్ తెలుగును చంపేస్తున్నాడని మండిపడుతున్నారు.


ఈ నిర్ణయంపై మంత్రి ఆదిమూలపు సురేష్ వివరణ ఇచ్చారు. తెలుగు భాషా వికాసానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన అన్నారు. పేదవాడికి మాత్రం ఉన్నత విద్య అందకూడదా.. అని నిలదీశారు. పాఠశాలల్లో నాడు – నేడు కార్యక్రమం మొదలుపెడితే ఇక నారా లేడు అనే స్టేజీ వస్తుందని భయపడుతున్నారని అన్నారు.


‘తెలుగుభాషకు అన్యాయం జరిగిందని ప్రతిపక్షాలు వితండవాదం చేస్తున్నాయి. సూటిగా ప్రశ్న వేస్తున్నాం.. గ్రామీణ ప్రాంతంలో చదువుకునే విద్యార్థుల సామర్థ్యాలను ప్రపంచ అవసరాలకు తీర్చిదిద్దే సమర్థవంతమైన సమాచార నైపుణ్యాలను అందించాలనే ఉద్దేశ్యం మీకు లేదా..? అని నిలదీశారు సురేష్.


పట్టణాల్లోనే కాదు.. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లను అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి స్పష్టం చేశారు. నవంబర్‌ 14వ తేదీన ప్రకాశం జిల్లా నుంచి నాడు – నేడు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రారంభిస్తారని చెప్పారు. గ్రామీణ ప్రాంతంలో సామర్థ్యానికి, నైపుణ్యానికి కొదవులేదు. కానీ, ఉద్యోగ అన్వేషణలో మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం, మారుతున్న కాలానికి అనుగుణంగా ఆంగ్ల మాధ్యమం పరిచయం చేయడం ఎంత అవసరమో చూస్తున్నాం.


ఆంగ్ల భాష నైపుణ్యాలను విద్యార్థుల్లో పొంపెందించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక తీసుకువచ్చింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియం తీసుకువచ్చాం. పదో తరగతి పరీక్షలకు వెళ్లేవారు ఇబ్బంది పడకూడదని, 8 నుంచి స్టార్ట్‌ చేస్తున్నానమని మంత్రి ఆదిమూలపు సురేశ్ వివరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: