అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్ధార్ విజయారెడ్డి హత్య కేసు రోజుకొక కొత్త మలుపు తిరుగుతోంది . విజయారెడ్డి ని సజీవదహనం చేసిన సురేష్ మృతి చెందిన తరువాత ఆయన భార్య లత , ఇప్పుడు కొత్త వాదన విన్పిస్తోంది . విజయారెడ్డి ని చంపాలన్నది తన భర్త ఉద్దేశమే కాదంటున్న లత , ఆమెను బెదిరించడానికే పెట్రోలు తీసుకుని తహశీల్ధార్ కార్యాలయానికి వెళ్లాడని చెప్పుకొచ్చింది . విజయారెడ్డి తన భర్త ను లంచం అడిగిందని , అందుకే తొమ్మిది లక్షల రూపాయలు కూడా ఇటీవల అప్పు చేశాడన్న లత , ఆ సొమ్ము ఎవరికిచ్చాడో మాత్రం తెలియదని అంటోంది .


 విజయారెడ్డి సజీవ దహన ఘటన లో సురేష్ ఒక్కడి ప్రమేయమే ఉందా?, లేకపోతే ఎవరైన వెనుకుండి అతడ్ని  నడిపించారా? అన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు . సురేష్ మృతి చెందడం తో దాదాపు ఈ కేసు ముగిసినట్టేనని  పోలీసు వర్గాలు చెబుతూనే , ఈ కుట్ర లో ఇంకా ఎవరికైనా భాగస్వామ్యం ఉందని తేలితే వారికి శిక్ష తప్పదని అంటున్నారు . రాష్ట్రం లో భూవివాదాలు కొత్తేమి కాకపోయినా , తమ భూవివాదాన్ని సరిచేయడం లేదన్న కారణంగా ఒక తహశీల్ధార్ పై పెట్రోలు పోసి నిప్పంటించిన ఘటన దేశ వ్యాప్తంగా ఇదే ప్రప్రథమని రెవెన్యూ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  


రెవిన్యూ ఉద్యోగులకు భద్రత కల్పించకపోతే , ఈ పరిస్థితుల్లో విధులు నిర్వహించడం కష్టమని పేర్కొంటున్నారు . అందరూ  రెవిన్యూ ఉద్యోగులంటే ఎందుకు కోపం ఉంటుందని , లంచాలకు రుచిమరిగి జలగల్లా పీల్చుకుతినేవారిపైనే ఎవరికైనా  ఆగ్రహం కలుగుతుందని సామాన్యులు అంటున్నారు . విజయారెడ్డి లంచం అడగడం వల్లే,  తన భర్త పెట్రోలు తీసుకువెళ్లి బెదిరించే ప్రయత్నం చేశాడన్న లత వాదనలో కూడా ఏమాత్రం పస కన్పించడం లేదంటూనే , ఒకవేళ లంచమే అడిగి ఉంటే ఎసిబి అధికారులకు పట్టిస్తే సరిపోయి ఉండేది కదా ? అంటున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: