ఈ మధ్యకాలంలో పెట్రోల్ పోసి చంపుతా అని బెదిరించడం బాగా ఫ్యాషన్ అయిపోయింది. మొన్నటికి మొన్న తెలంగాణాలో ఓ తహసీల్దార్ ని పెట్రోల్ పోసి చంపగా నిన్న ఆంధ్రాలో ఓ రైతు పెట్రోల్ పోసుకొని బెదిరించాడు. అవినీతి అధికారుల వేధింపులకు తట్టుకోలేక ఒకప్పుడు వారిపై వారే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకునే వారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. అందుకే మానిసిక రోగం రావడానికి గల వారిపై పెట్రోల్ పోసి చంపుతున్నారు. 

                              

ఇంకా విషయానికి వస్తే.. ఇంగ్లాండులో ఎసెక్స్‌లోని బాసిల్డన్‌లో జస్టిన్ జాక్సన్ (28) అనే యువకుడు ఓ బైకును దొంగిలించాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతన్ని వెంబడించారు. రోడ్డు మార్గంలో ఒక టీమ్, హెలికాఫ్టర్ లో మరో టీమ్ అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించింది. 

                                        

అయితే వాళ్ళ నుండి తప్పించుకోడానికి ప్రయత్నించినా ఆ దొంగ అతని దగ్గర ఉన్న పెట్రోల్ ఆ 8 మంది పోలీసులపై పోసి బెదిరించాడు. దీంతో ఆ పోలీసులు అంత ఒక్కసారిగా పరిగెత్తి అక్కడే ఉన్న స్థానికుల సహాయంతో వారిపై నీళ్లు కుమ్మరించుకొని ప్రాణాలను కాపాడుకున్నారు. అనంతరం ఆ దొంగని పోలీసులు పట్టుకున్నారు. 


అయితే అతన్నీ కోర్టులో హాజరు పరచగా అతనికి కేసును విచారించిన కోర్టు అతనికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది. పోలీసుల ప్రాణాలకు ముప్పు ఉన్న పెట్రోల్ ని వాడినందుకు ఈ శిక్ష విధించినట్టు న్యాయమూర్తి వెల్లడించాడు. అయితే అది కావాలని చెయ్యలేదని, అతన్ని కాపాడుకోవడానికే చేశాడని చెప్పినప్పటికీ అతని శిక్ష తగ్గించడం కుదరదని న్యాయమూర్తి స్పష్టం చేశాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: