వై.ఎస్. జగన్ సర్కారు వచ్చే ఏడాది నుంచి తెలుగు మీడియం నుంచి ఎత్తేయాలని సంచలన నిర్ణయం తీసుకుంది. దీనిని ప్రతిపక్ష టీడీపీ తప్పుబడుతోంది. జగన్ నిర్ణయంతో తెలుగు భాష చచ్చిపోతుందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా వాస్తవాలు ఒకసారి పరిశీలన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


రాష్ట్రంలో విద్యను అభ్యసిస్తున్న వారి సంఖ్య మొత్తంగా పరిశీలిస్తే 70,90,217 మంది విద్యార్థులు అక్టోబర్‌ వరకు నమోదయ్యారు. వారిలో 44,21,529 మంది అంటే 62.3 శాతం ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్నారు. వారిలో అత్యధికులు ఓసీలు.. మొత్తం 82.6 ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్నారు. ఇంగ్లీష్ మీడియం చదివే వారిలో ఎస్టీకి చెందిన విద్యార్థులు 33.23 శాతం మాత్రమే. ఎస్సీకి చెందినవారు 49.61 శాతం మాత్రమే. వెనుబడిన వారు 62.5 శాతం మాత్రమే.


ఆంగ్ల మాధ్యమంలో స్కూళ్లు అందుబాటులో లేకపోవడం, ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లు కేవలం ధనికులకు మాత్రమే పరిమితమైపోయింది. గ్రామీణ ప్రాంతంలోని ఎస్సీ, ఎస్టీలు వెనుబడ్డారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పోటీ ప్రపంచంలో రాణించాలంటే ఇంగ్లీష్ విద్య అత్యవసరం. అందుకే జగన్ సర్కారు. నాడు – నేడు కార్యక్రమంతో ముందుకెళ్లి అక్కడితో ఆగకుండా కాంపిటేటివ్‌ పరీక్షలకు సంబంధించి విద్యార్థులను తర్ఫీదులు కూడా ఇవ్వాలని నిర్ణయించింది.


విద్యా ప్రమాణాల్లో మార్పులు తీసుకురావాలని దార్శనికతతో సీఎం వైయస్‌ జగన్‌ ముందుకువెళ్తున్నారు. మొదట స్కూళ్లలో మౌలిక వసతులు పటిష్టం చేయనున్నారు. నవంబర్‌ 14న ప్రకాశం జిల్లా నుంచి నాడు – నేడు కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారు. దశలవారీగా ఉన్నత ప్రమాణాలతో కూడిన కరికులం ఏర్పాటు చేస్తారు.


వచ్చే ఏడాది నుంచి ఒకటి నుంచి 5వ తరగతి వరకు సిలబస్‌ మార్పు, మిగతా క్లాస్‌లకు కూడా మార్పు చేయడం జరుగుతుంది. విద్యార్థులు మెరుగైన విద్యను అభ్యసించి వారి నైపుణ్యాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని విద్యావ్యవస్థను అంచెలంచెలుగా తీసుకెళ్తున్నారు. దీనిని వ్యతిరేకించడం అంటే... పేద పిల్లలకు ఆంగ్ల విద్య వద్దని చెప్పడమే.


మరింత సమాచారం తెలుసుకోండి: