ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సుపుత్రుడు మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి కోపం కట్టలు తెంచుకుంది. ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై సంచలన విమర్శలు చేశారు నారా లోకేష్.. అగ్రిగోల్డ్‌ విషయంలో ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేస్తానని.. రాజ‌కీయాల నుంచే త‌ప్పుకుంటానని లోకేష్ సవాల్ విసిరారు. 

                                    

ఇంకా విషయానికి వస్తే.. ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడిన మాటలను విమర్శించినా నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అగ్రిగోల్డ్ విషయంలో ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్సీ ప‌ద‌వికి చేస్తా, రాజకీయాలకు గుడ్ బై చెప్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అగ్రిగోల్డ్ మోసాలు వైఎస్ అధికారంలోనే వెలుగు చూశాయని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. 

                                 

తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బాధితుల‌కు న్యాయం చేయాల‌ని రూ.336 కోట్లు సిద్ధం చేసి ఆగిపోయినట్టు ఆయన చెప్పుకొచ్చారు. అయితే అగ్రిగోల్డ్ ఆస్తుల‌పై క‌న్నేసిన వైసీపీ నేతలు రూ.264 కోట్లను పంపిణీ చేసి మిగిలిన రూ.72 కోట్లు మింగేశారని ఆరోపించారు.

                              

అయితే నారా లోకేష్ ఆరోపణలకు స్పందించిన నెటిజన్లు.. బాబు తొందర పడకు.. ఇబ్బంది పడుతావ్ అని ఒకరు కామెంట్ పెడితే.. మరి కొందరు స్పందిస్తూ.. మీరు బాధితులకు సహాయం చెయ్యాలనుకుంటే సిద్ధం చేసిన డబ్బు ప్రజలకు ఎందుకు అందలేదు అంటూ ప్రశ్నించారు. ఇంకా ఆలా మాట్లాడటానికి ఉండాలి లోకేషు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు నెటిజన్లు. 


మరింత సమాచారం తెలుసుకోండి: