పవన్‌ కల్యాణ్‌ జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోవాలని, ముఖ్యమంత్రి, మంత్రులపై వ్యక్తిగత విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోనని వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు హెచ్చరించారు. సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే స్థాయికి పవన్‌ కల్యాణ్‌ జీవితంలో వెళ్లలేడన్నారు. లాంగ్‌మార్చ్‌ అని పేరుపెట్టి చైనాలో పదివేల కిలోమీటర్లు నడిచిన వారిని పవన్‌ కల్యాణ్‌ అవమానించాడని పండుల రవీంద్రబాబు అన్నారు.


ఇసుక అని విశాఖను సెలక్ట్‌ చేసుకొని, నడక అని చెప్పి కారు ఎక్కి, ఇసుక గురించి మాట్లాడుతాడనుకుంటే వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబును తిట్టేందుకు పవన్‌ కల్యాణ్‌ సభ పెట్టినట్లుగా ఉందన్నారు. టీడీపీ ఏ విధంగా ఇసుకను దోచుకుంది. ఇసుక వల్ల ప్రభుత్వం ఎలా కూలిపోయిందనే విషయాన్నే పవన్‌ మర్చిపోయాడన్నారు. మంత్రి కన్నబాబును తిట్టేందుకే లాంగ్‌మార్చ్‌ పెట్టినట్లు స్పష్టంగా అర్థం అవుతుందన్నారు.


సరైన అవగాహన లేనివారినంత పక్కన కూర్చోబెట్టుకొని పవన్‌ కల్యాణ్‌ అన్ని తప్పుల తడకలు మాట్లాడాడన్నారు. ఇసుక గురించి పవన్‌కు అసలు అవగాహనే లేదన్నారు. ఇసుక కోసం పోరాటం చేస్తే ఎవరైనా ఇసుక లభించే ప్రాంతాలు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని నదుల దగ్గరకు వెళ్లి మార్చ్‌ చేస్తే బాగుంటుంది.. కానీ విశాఖలో మార్చ్‌ చేయడం ఏంటని పండుల రవీంద్రబాబు ప్రశ్నించారు.


ఇసుక గురించి ఏమైనా మాట్లాడుతాడా అని చూశాను కానీ, ఆ అంశాన్ని మర్చిపోయి మంత్రి కన్నబాబును తిడుతున్నాడన్నారు. కన్నబాబుకు ఇసుకకు, పవన్‌ కల్యాణ్‌కు ఆంధ్రప్రజలకు ఏంటీ సంబంధం అని ప్రశ్నించారు. దయచేసి ఇటువంటి కుమ్మక్కు రాజకీయాలు, స్టేజీ మీద బల్లలు బద్దలుకొట్టేయడం ఇకనైనా పవన్‌ మానుకోవాలని సూచించారు. సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే అర్హత పవన్‌కు లేదన్నారు. ముఖ్యమంత్రి ఆలోచన, ఆయన పథకాలను విమర్శించేస్థాయికి ఈ జన్మలో వెళ్లలేరన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: