రైల్వే టికెట్ ముందుగా బుక్ చేసుకోవాలంటే చుక్కలు కనిపిస్తాయి. ఒక టికెట్ కి పేమెంట్ చెయ్యాలంటే చాలు ఎంతో సమయం తీసుకుంటుంది. ఇంకా మీ ఫోన్ లోని డేట్ స్పీడ్ ఎంత ఉన్న సరే ఆ టికెట్ కి పేమెంట్ అయ్యేసరికి టికెట్లు అప్పటికే ఇంకొకరు బుక్ చేసుకొంటారు. ముఖ్యంగా తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో పేమెంట్ వేగంగా జరగకపోతే టికెట్ కన్ఫార్మ్ అవ్వడం కష్టమే. 

                                          

అయితే అలాంటి కష్టాలన్నింటికీ ఇప్పుడు గుడ్ బై చెప్పేసే సమయం వచ్చేసింది. ఐఆర్‌సీటీసీ ఐముద్రా పేమెంట్ వాలెట్‌తో ఇప్పుడు టికెట్ బుకింగ్ పేమెంట్‌ను ఈజీగా జరపచ్చు. అయితే అందులో ట్రైన్ టికెట్ బుకింగ్‌తో పాటు ఆన్‌లైన్ షాపింగ్ కూడా చెయ్యచ్చు. అంతే కాదు అందులో నుంచి స్నేహితులకు, ఇతురులకు డబ్బు ఈజీగా పంపించేయచ్చు. 

                                                   

ఓటీపీతో ట్రైన్ టిక్కెట్లను సులభంగా బుక్ చేసుకోవచ్చు.. అది ఎలానో ఇక్కడ చదవండి. ఐఆర్‌సీటీసీ పోర్టల్‌లో లాగిన్ అవ్వాలి. టికెట్ బుకింగ్‌ను ప్రారంభించి పేమెంట్ ఆప్షన్‌లో ఐపే అని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఐఆర్‌సీటీసీ ముద్రా వేసి ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. వెంటనే వన్ టైం పాస్వర్డ్ (ఓటీపీ) వస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తే టికెట్ ఈజీగా బుక్ అయిపోతుంది. చూసారుగా ఇప్పుడు ఎంత ఈజీగా టికెట్ బుక్ చేసుకోవచ్చు అనేది.. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ట్రై చెయ్యండి. 


మరింత సమాచారం తెలుసుకోండి: