అయోధ్యలో వివాదాస్పదంగా 2.77 ఎకరాలకు సంబంధించిన భూమి గురించిన తీర్పు ఈరోజు వెలువడబోతున్నది.  ఈ కేసుకు సంబంధించిన తీర్పు వస్తున్న తరుణంలో అయోధ్యలోసెక్యూరిటీ ని పెంచారు.  నాలుగంచెల భద్రత నడుమ అయోధ్య పట్టణం ఉండటం విశేషం.  అయోధ్య కేసును ఎవరు కూడా గెలుపు ఓటమిగా భావించవద్దని ఇప్పటికే ప్రధాని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  ప్రధాని విజ్ఞప్తి మేరకు అక్కడి ప్రజలు సైలెంట్ గా ఉన్నారు.  


ఇక వివాదాస్పద రామ మందిరం ఆలయాల ప్రధాన పూజారి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.  రామ మందిరం విషయంలో ఎవరూ కూడా ఆగ్రహావేశాలకు పోవద్దని పేర్కొన్నారు. తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చినా దాన్ని స్వీకరించాలని అన్నారు.  ఆవేశాలకు పొతే దానివలన ధర్మం దెబ్బతింటుందని అయన చెప్పారు.  ఇక అయోధ్యలో 24 గంటలు మానిటరింగ్ చేసేందుకు మాస్టర్ కంట్రోల్ రూమ్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.  


ఉదయం నుంచి సాధారణంగా ప్రజలు మామూలుగానే అయోధ్యలో తిరుగుతున్నారు.  వారి డైలీ లైఫ్ కు అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేనట్టుగా తెలుస్తోంది.  ఈ ఉదయం 10:30 గంటలకు తీర్పు వస్తున్న నేపథ్యంలో అందరి దృష్టి ఇప్పుడు ఈ తీర్పుపైనే ఉండటం విశేషం.  తీర్పు ఎలా ఉండబోతుంది అన్నది మరికాసేపట్లోనే తేలిపోతుంది.  ఇక ఈ తీర్పు వస్తున్న నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం స్కూల్స్, కాలేజీలకు సెలవులు ప్రకటించింది.  


సున్నితమైన కొన్ని ఏరియాల్లో సెల్, ఇంటర్నెట్ ను బంద్ చేసింది.  ఇక జమ్మూ కాశ్మీర్లో ఈరోజు 144 వ సెక్షన్ విధించారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో సెక్యూరిటీని పెంచారు.  అన్ని రాష్ట్రాలను కేంద్రం హెచ్చరిస్తూ హైఅలర్ట్ ను ప్రకటించింది.  దేశంలో ఇప్పుడు అందరి నోటాఅయోధ్య గురించే ఉండటం విశేషం.  దాదాపుగా 134 సంవత్సరాలుగా ఈ భూమికి సంబంధించిన వివాదం ఉండటం విశేషం.  


మరింత సమాచారం తెలుసుకోండి: