ఎన్నో దశాబ్దాలుగా వీడని వివాదానికి  నేడు తెరపడనుంది. అయోధ్య వివాదం పై నేడు సుప్రీం కోర్టు తుది తీర్పు వెల్లడించనుంది . అయోధ్యలోని 2.77 ఎకరాల భూమికి సంబంధించి వివాదం కొన్ని దశాబ్దాలుగా  రగులుతూనే ఉంది. ఈ ప్రదేశం శ్రీరామచంద్రస్వామి పుట్టిన ప్రదేశం గా హిందువులు బాధిస్తుంటే... 16 వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి బాబర్ మసీదు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. అయితే దీనిపై 1992లో హిందూత్వవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పట్లో బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన  క్రమంలో జరిగిన అల్లర్లలో దాదాపు 2000 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా ఈ వివాదానికి సంబంధించి విచారణ జరిపిన  సుప్రీంకోర్టు నేడు సంచలన తీర్పు  వెల్లడించనుంది . ఈ తీర్పుపై ప్రజల్లోనే కాదు ప్రభుత్వాలకు కూడా ఫుల్ టెన్షన్  పెంచుతుంది. సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చినా దాన్ని స్వాగతిస్తూ పోతే ఎలాంటి సమస్య ఉండదని అన్ని ప్రభుత్వాలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పు అనంతరం ఎలాంటి అల్లర్లు జరగకుండా ఉత్తరప్రదేశ్ ఢిల్లీ మధ్యప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లో పూర్తిగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు. అంతేకాకుండా అక్కడి స్కూల్ విద్యా సంస్థలకు కూడా సెలవు ప్రకటించారు యూపీలో అయితే సోమవారం వరకు విద్యాసంస్థలు తెరుచుకోవడం లేదు. 



 అయోధ్య కేసులో సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు వెలువరించిన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్త పడుతున్నారు పలు రాష్ట్రాల సీఎంలు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చిన ప్రజలు సంయమనంతో ఉండాలని ఎలాంటి పుకార్లను నమ్మవద్దు అంటూ ప్రజలకు సూచించారు. సుప్రీంకోర్టు తీర్పుని ప్రజలందరూ సంయమనంతో స్వాగతించాలి అంటూ కోరారు. అయితే రాష్ట్ర ప్రజల రక్షణ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తెలిపిన యోగి ఆదిత్యనాథ్... లా అండ్ ఆర్డర్ కు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక ఢిల్లీలో కూడా అన్ని ప్రభుత్వ స్కూళ్లకు సెలవులు ప్రకటించినట్లు  తెలిపారు ఉప  ముఖ్య మంత్రి మనీష్ సిసోడియా. ప్రైవేట్ స్కూలు కూడా స్వచ్ఛందంగా స్కూళ్లను మూసేస్తే మంచిదని కూడా సూచించారు ఆయన.



 అయోధ్య కేసు పై దాదాపు 40 రోజుల పాటు విచారించిన అత్యున్నత న్యాయస్థానం అక్టోబర్  16న వెలువరించాల్సిన  తీర్పును రిజర్వ్లో పెట్టింది. కాగా  నేడు ఉదయం 10:30 గంటలకు  సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇవ్వనుంది . అప్పటి నుంచి ఇప్పటి వరకు అటు కేంద్ర ప్రభుత్వం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సహా  పలు రాష్ట్రాలకు చెందిన సీఎం లు  తమ తమ రాష్ట్రాల్లో శాంతిభద్రతలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో అంతా కంట్రోల్లోనే ఉందని క్లారిటీ కి వచ్చాక తీర్పు ఇచ్చేందుకు సుప్రీం కోర్టు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎలాంటి  తీర్పు వెలువరించనుంది అంటూ దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు దేశ ప్రజలందరి చూపు మొత్తం సుప్రీంకోర్టు తీర్పు పైన ఉంది. దేశంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: