సమాజంలో రోజురోజుకీ ఆన్లైన్ ప్రేమలు ఎక్కువైపోతున్నాయి. చాటింగ్లు...  మీటింగ్లు... డేటింగ్లు ఆన్లైన్ లోనే  జరిగిపోతుంది. ఇక్కడ ఇదే జరిగింది. ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ప్రేమించుకున్నారు. ప్రేమించుకున్నది ఏ  ట్విట్టర్ లోనూ ఫేస్ బుక్ లోనూ కాదండోయ్ . ప్రస్తుతం చిన్న పెద్ద తేడాలేకుండా అందరినీ ఒక ఊపు ఊపేస్తున్న టిక్ టాక్ యాప్ లో . టిక్ టాక్ లో వీడియోలు చేశామా...ఎంటర్టైన్మెంట్ పొందామా   అన్నట్టు ఉండాలి కానీ కొంతమంది డీప్ గా  వెళ్తారు. ప్రస్తుతం ఇక్కడ అదే జరిగింది. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ చెందిన 21 ఏళ్ల వయసున్న ఇద్దరు  అమ్మాయిలు  టిక్ టాక్ వీడియోలు చేసేవాళ్ళు... ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలంకి చెందిన  వంశీ స్వామీలు కూడా టిక్  టాక్  వీడియోలు చేసే వాళ్ళు . ఇక ఇక్కడమ్మాయిలు అక్కడబ్బాయిలు టిక్ టాక్  ఒకరినొకరు ఫాలో అవుతూ.. ఒకరీ వీడియోలు ఒకరు  చూసుకున్నారు. ఈ క్రమంలోనే వీరి మధ్య స్నేహం ఏర్పడింది... స్నేహం కాస్తా ప్రేమకు దారి తీసింది. ఆరునెలలు తిరిగేసరికి ఈ నలుగురు పెళ్లి చేసుకోవాలని భావించారు. 



 దీని  కోసం ప్లాన్ వేసుకున్నారు... ప్లాన్ లో  అనుకున్న ప్రకారమే పెళ్లి చేసుకోవడానికి సిద్దిపేట జిల్లాకు చెందిన ఇద్దరు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాకు చేరుకున్నారు. అక్కడికి వెళ్ళాక ఆ అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు కి నచ్చలేదు. దీంతో అబ్బాయిలు రివర్స్ అయ్యారు. పెళ్లి లేదు వెళ్ళలేదు తిరిగి వెళ్లిపోమంటే అమ్మాయిలకు  చెప్పేశారు అబ్బాయిలు. అయితే ఎంతో కష్టపడి ఇంట్లో వాళ్ళకు చెప్పకుండా ఇంత దూరం వస్తే మమ్మల్ని తిరిగి వెళ్ళిపోమ్మంటారేంటి  అని ప్రశ్నించిన అమ్మాయిలు... తమను మోసం చేయొద్దని పెళ్లి చేసుకోమని  అబ్బాయిలను వేడుకున్నారు. అమ్మాయిలు ఎంత ప్రాధేయపడినా అబ్బాయిలు మాత్రం కొంచెం కూడా కరగలేదు.అటు  ఇద్దరమ్మాయిలను ఇళ్లలోంచి బయటకు గెంటేశారు కూడా. దీంతో  తిండిలేక కిందపడిపోయారు ఆ ఇద్దరమ్మాయిలు. 



 దీంతో చుట్టుపక్కల వాళ్ళకి ఈ విషయం తెలియడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు అసలు ఏం జరిగింది అంటూ అడిగితే... అసలు ఆ అమ్మాయిలు  ఎవరో కూడా తమకు తెలియదని నాటకాలు ఆడారు ఆ ఇద్దరు అబ్బాయిలు. టిక్ టాక్  ఓపెన్ చేసి చూసేసరికి ఆధారాలు లభించాయి. అయితే అబ్బాయిలు కటకటాల పాలయ్యారు. బాధిత అమ్మాయిలను అనంతపురం జిల్లాలోని ఉజ్వల్  హోమ్ కి తరలించారు పోలీసులు. టిక్ టాక్   అందరినీ ప్రభావితం చేస్తుంది అనుకున్నాము  కానీ... మరి ఇంతగా ప్రభావితం చేస్తుందా అనుకుంటున్నారు ఈ విషయం తెలిసిన ప్రజలు . ఆన్లైన్ యాప్ లను  ఎంటర్టైన్మెంట్  కోసం ఉపయోగించాలి కానీ ఇలా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: