దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అయోధ్య కేసులో తీర్పు కాసేపట్లో రాబోతోంది. దేశంలో దశాబ్దాల తరబడి పెండింగులో ఉన్న.. అతి కీలకమైన అయ్యోధ్య అంశంపై తుది తీర్పురాబోతోంది. అయితే ఈ కేసు విషయంలో భారతీయుల్లో భావోద్వేగాలు ఉండటం సహజం. అటు హిందువులు, ఇటు ముస్లింలు.. ఈ తీర్పుతో ప్రభావితం అవుతారు.


అయితే తీర్పు విషయంలో ఏ వర్గానికి చెందినవారైనా భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవడం ఉత్తమం. లేనిపక్షంలో అనవసరంగా కేసుల్లో ఇరుక్కునే అవకాశం ఉంది. సున్నిత సమస్య కాబట్టి.. ఈ అయోధ్య వ్యవహారంపై ఎలాంటి శాంతి భద్రతలు తలెత్తకుండా ప్రభుత్వాలు అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగానే సామాజిక మాధ్యమాలపైనా తీవ్ర నిఘా ఉంటుంది.


దేశవ్యాప్తంగా ఉద్విఘ్న వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మనం కూడా మన జాగ్రత్తలో ఉంటే మంచిది. లేకపోతే.. అనవసరంగా కేసుల్లో ఇరుక్కుంటారు. సామాజిక మాధ్యమాల్లో మీకొచ్చిన సందేశాన్ని మరొకరికి పంపించారంటే కోరి మీరు చిక్కుల్లో పడతారు. కాబట్టి ఈరోజు సోషల్ మీడియాలో ఈ తీర్పుకు సంబంధించి ఎలాంటి పోస్టులు పెట్టకపోవడం.. మీకు వచ్చిన వాటిని ఎవరికీ పంపకపోవడం ఉత్తమం.


పోస్టు మీరు సృష్టించకపోయినా.. మీరు ఫార్వార్డ్ చేసినా.. పోలీసు కేసుల్లో ఇరుక్కునే అవకాశముంది. అయోధ్య తీర్పు నేపథ్యంలో రాష్ట్రాలనూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అప్రమత్తం చేసింది. ఈనేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు సమావేశమై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. సున్నితమైన ప్రాంతాల్లో ఇరుమతాల పెద్దలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.


అయోధ్య తీర్పు నేపథ్యంలో సామాజిక మాధ్యమాలపై పోలీసుశాఖ ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. వదంతుల వ్యాప్తి విషయంలో కఠినంగా వ్యవహరిస్తుంది. అయోధ్య తీర్పుపై వచ్చే సందేశాలను ‘డిలీట్‌’ చేయాలని పోలీసులు వెల్లడించారు. ఎవరైనా వాటిని మరొకరికి కాని, మరో గ్రూప్‌నకు కాని పంపిస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: