కొన్ని దశాబ్దాల కాలం నుంచి రగులుతున్న అయోధ్య భూవివాదం పై నేడు తుది తీర్పు వెల్లడించనుంది  దేశ అత్యున్నత న్యాయస్థానం. సుప్రీం కోర్టు వెలువరించే తీర్పు కోసం దేశమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. ఈరోజు 10.30 గంటలకు అయోధ్య  భూవివాదంపై  దేశ అత్యున్నత న్యాయస్థానం తుది తీర్పును వెల్లడించనుంది . 2.77 ఎకరాల భూమిలో ఈ వివాదం మొదలైంది. ఈ భూమిలో రాముడు జన్మించిన స్థలం అంటూ హిందువులు భావిస్తుంటే... 16వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి బాబ్రీ  మసీదు నిర్మించారంటూ  ముస్లింలు వాదిస్తున్నారు. ఈక్రమంలో 1922లో మసీదు కూల్చివేత తో దేశంలో ఎన్నో అల్లర్లు జరిగాయి. దాదాపు 2000 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. కాగా 70 ఏళ్లకు పైగా రగులుతున్న ఈ వివాదం పై  నేడు సుప్రీం కోర్టు ధర్మాసనం సంచలన  తీర్పును వెల్లడించంనుండి. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ తమ రాష్ట్రాలలో హై అలర్ట్ ప్రకటించారు. సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పును వెలువరించినప్పటికి  సంయమనంగా ప్రజలందరూ సుప్రీం తీర్పును  స్వీకరించాలని దేశ ప్రధాని సైతం ప్రజలకు పిలుపునిచ్చారు.



సుప్రీం తీర్పు నేపథ్యంలో  ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రల్లో  పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయగా.. సుప్రీం కోర్టు ఆవరణలో మూడంచెల భద్రతను ఏర్పాటు చేసింది. అత్యంత సున్నితమైన సమస్యాత్మకమైనదిగా  భావిస్తున్న ఈ అయోధ్య తీర్పు కోట్లాది మంది హిందువులు ముస్లింల మనోభావాలతో ముడిపడి ఉన్న విషయం కావడంతో   అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిస్తోంది కేంద్రం . ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పుపై వస్తున్న పుకార్లను నమ్మవద్దని ప్రజలకు సూచించారు అధికారులు. అంతేకాకుండా ఉత్తర ప్రదేశ్ కర్ణాటక ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో  విద్యాసంస్థలకు సెలవులు కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపి వేసేందుకు కేంద్రం నిర్ణయించింది.




కొన్ని  దశాబ్దాల నాటి భూవివాదంలో తుది తీర్పు నేడు సుప్రీం కోర్టు వెల్లడించనున్న  నేపథ్యంలో ఇప్పటికే దేశంలో హై అలర్ట్ ప్రకటించారు. ఈ క్రమంలో దేశంలోని పలు సున్నితమైన ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపి వేయాలని కేంద్రం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు వద్ద కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా మూడంచెల భద్రత ఏర్పాటు చేయగా ... సుప్రీం కోర్టు జడ్జి లకు కూడా భారీగా భద్రతా సిబ్బందిని కేటాయించారు. ఇంటర్నెట్ ద్వారా చాలా మంది ప్రజలను రెచ్చగొట్టే పోస్టులు పెడితారనే  ఆలోచనతో ఇంటర్నెట్ సేవలను అధికారులు నిలిపివేసినట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: