తెలంగాణలో ఆర్టీసి సమ్మె రగడ గత ముప్పై ఆరు రోజుల నుండి రగులుతూనే ఉంది.కానీ ఇప్పుడు వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కారం విషయంలో సానుకూలంగా స్పందించలేదు. అటు కార్మికులకు కూడా సమ్మె  మొదలై 35 రోజులకు చేరుకున్నప్పటికీ కూడా తమ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు సమ్మె విరమించే ప్రసక్తి లేదని తేల్చి చెబుతున్నారు. ఈ క్రమంలో అటు ఆర్టీసీ సమ్మె రోజు రోజుకు ఉదృతం  అవుతుండగా... ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్ మొండి వైఖరి కూడా రోజురోజుకు పెరిగిపోతోంది. కాగా  హైకోర్టులో కూడా ఆర్టీసీ సమ్మెపై  పై విచారణ జరుగుతూనే ఉంది. ఇక ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో మూడుసార్లు చర్చలు జరిపినప్పటికీ మూడుసార్లు చర్చలు అర్ధాంతరంగానే  ముగిసాయి. ఈ క్రమంలో ఆర్టీసీ కార్మికులు కూడా కేసీఆర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 



 ఇప్పటికే ఒకసారి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ జేఏసీ  రాష్ట్రంలో సమ్మెను ఉధృతం చేసింది. తాజాగా  కేసీఆర్ తీరుతో  మండిపడ్డ ఆర్టీసీ జేఏసీ  మరోసారి తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. అటు ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు ఏ మాత్రం సానుకూలంగా స్పందించడం లేదు. ఇప్పటికే ఆర్టీసీలోని 5,100 రూట్లను  ప్రైవేటీకరణ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ సమ్మె ఇప్పటికే 36 రోజులకు చేరుకున్న తరుణంలో కేసీఆర్ తీరుపై  కార్మికులందరూ ఆందోళన చెందిన కొంత మంది ఆత్మహత్యలు చేసుకుంటే..ఇంకొంత మంది  తమ భవిష్యత్తు  ఏంటో అని మనస్థాపం తో  గుండెపోటుతో మరణిస్తున్నారు.



 ఇదిలా ఉండగా తాజాగా ఆర్టీసీ జేఏసీ ప్రకటించిన భవిష్యత్తు కార్యాచరణ ప్రకారం ఈ నెల  4వ తేదీ నుంచి వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు ఆర్టీసీ జేఏసీ నేతలు. ఈ నేపథ్యంలో  నేడు చలో ట్యాంక్ బండ్  కు పిలుపునిచ్చింది ఆర్టీసీ జేఏసీ .కానీ  హైదరాబాద్ పోలీసులు మాత్రం చలో  ట్యాంక్ బండ్ కార్యక్రమానికి  అనుమతి నిరాకరించారు. అనుమతి లేకుండా ట్యాంకుబండు పైకి వస్తే అరెస్టులు చేస్తామంటూ హెచ్చరించారు పోలీసులు. ఆర్టీసీ జేఏసీ నేతలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చలో  ట్యాంక్ బండ్  కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని తేల్చిచెప్పారు. ఈ క్రమంలో ఆర్టీసీ జేఏసీ కార్మికుల నిరసనలో భాగంగా ట్యాంకుబండు పైకి మరికొద్ది సేపట్లో రానున్నారు... కాగా ఆర్టీసీ జేఏసీ నిరసనకు అనుమతి నిరాకరించిన పోలీసులు ట్యాంక్ బండ్ పై అరెస్టు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. దీంతో నేడు జరగబోయే నిరసన కార్యక్రమం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసేలా  కనిపిస్తుంది. నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్న ఆర్టీసీ కార్మికులు అందరికీ ట్యాంక్ బండ్ క్లోస్... వస్తే అరెస్టులే  అంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: