సుప్రీం కోర్టు మరికాసేపట్లో అయోధ్య వివాదంపై తీర్పు చెప్పబోతున్నది.  ఈ తీర్పు ఎలా ఉండబోతుందో అనే ఉత్కంఠత అందరిలోనూ ఉన్నది.  ఈ తీర్పు ఎలా ఉన్నా సరే అందరు దాన్ని ఆమోదించాలని కోర్టు ఇప్పటికే తెలియజేసింది.  అటు ప్రభుత్వం కూడా తీర్పును గౌరవించాలని, తీర్పు అనుకూలమా కదా అన్నది పక్కన పెట్టాలని, తీర్పు ఎలా ఉన్న సరే దాన్ని అందరి తీర్పులా భావించాలని పేర్కొన్నది. 


అటు కేరళలో ఉన్న లెఫ్ట్ ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని పేర్కొన్నది.  రాష్ట్రంలో ఎలాంటి అలజడులు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని, అందరికి ఆమోదయోగ్యమైన తీర్పు వెలువడాలని కోరుకుంటున్నట్టు ముఖ్యమంత్రి పితరన్ పేర్కొన్నారు.  శాంతి భద్రతల విషయంలో పోలీసు శాఖ అప్రమత్తంగా ఉందని అన్నారు.  ప్రతి ఒక్కరు శాంతియుతంగా ఉండాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు.  


ఇక శివసేన కొన్ని వివాదాస్పదమైన మాటలు మాట్లాడింది.  రామ్ జన్మభూమి విషయంలో ప్రభుత్వం ఏమి చేయలేదని, కోర్టు చేతుల్లోనే ఉందని, ఒకవేళ మందిరం నిర్మాణానికి అనుకూలంగా వస్తే, ఆ క్రెడిట్ అంతా కోర్టుకే ఇవ్వాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోకూడదని అన్నారు. గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో బీజేపీకి, శివసేనకు మధ్య వార్ జరుగుతున్నది.  


ముఖ్యమంత్రి పదవి విషయంలో బీజేపీ, శివసేన రెండు పార్టీలు రాజీపడటం లేదు.  దీంతో రెండు పార్టీలు విడిపోయినట్టే అని చెప్పాలి.  ముఖ్యమంత్రి ఫడ్నవిస్ నిన్న రాజీనామా చేశారు.  ఏదో ఒకనాటికి శివసేనకు చెందిన వ్యక్తి మహారాష్ట్రకు ముఖ్యమంత్రి అవుతాడని, శివసేన అభ్యర్థి ముఖ్యమంత్రి కావడానికి మోడీ, షా అనుమతి అవసరం లేదని ఉద్దవ్ థాకరే చెప్పిన సంగతి తెలిసిందే. బీజేపీతో అధికారం పంచుకోవాలి అంటే ముఖ్యమంత్రి పీఠం కూడా పంచుకోవాలని గత కొన్ని రోజులుగా శివసేన మెలిక పెడుతూ వచ్చింది.  తమకు 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్తూ వస్తున్నది శివసేన. 


మరింత సమాచారం తెలుసుకోండి: