40 ఏండ్ల రాజ‌కీయం.. ఇందులో  ప్ర‌తిప‌క్ష నేత‌గా ప‌దేండ్ల‌కు పైగా అనుభ‌వం. ఇక‌ అధికారం అనుభ‌వించింది 14 ఏండ్ల అనుభవం. అలాంటి అనుభ‌వం ఉన్న నేత ప్ర‌స్తుత ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు చంద్ర‌బాబు నాయుడు. అలాంటి చంద్ర‌బాబు ఇప్పుడు చేస్తున్న ఉద్య‌మాలు, ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు, మాట్లాడుతున్న తీరు, ఆయ‌న అధికారం కోసం పడుతున్న తాప‌త్ర‌యం చూస్తుంటే న‌వ్వురాక మాన‌దు. ఇక ఇప్పుడు చంద్రాలు చేయ‌బోతున్న దీక్ష చూస్తుంటే ఇంకా ప‌డిప‌డి న‌వ్వాల‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఏపీలో ఇసుక కొర‌త తీవ్రంగా ఉన్నమాట వాస్త‌వ‌మే. ఇసుక కొర‌త‌తో ఏపీలోని భ‌వ‌న నిర్మాణ కార్మికులు ఇబ్బందులు ప‌డుతున్న మాట వాస్త‌వ‌మే.


అయితే ప్ర‌తి ఏటా వ‌ర్షాకాలంలో ఇసుక కొర‌త అనేది రావ‌డం కామ‌న్‌. ఇసుక కొర‌త ఉన్న‌ప్పుడు కొంత ప‌నులు మంద‌గించ‌డం కామ‌నే. అయితే భ‌వ‌న నిర్మాణం చేసుకునే య‌జ‌మాని ముందు జాగ్ర‌త్త‌గా ఇసుక కొర‌త రాకుండా జాగ్ర‌త్త ప‌డాల్సి ఉంటుంది. అయితే వ‌ర్షాకాలంలోనే ఏపీలో ఎన్నిక‌లు రావ‌డం, ప్ర‌భుత్వం మార‌డం, బాబోరు ప్ర‌భుత్వం బొల్తా ప‌డ‌టం, అధికారంలోకి జ‌గ‌న్ రావ‌డం జ‌రిగింది.  


జ‌గ‌న్ అధికారంలోకి రాగానే ఏపీలో వ‌ర్షాలు జోరుగా కురిసి ప్ర‌జ‌ల‌ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. క‌నివిని ఎరుగ‌ని వ‌ర‌ద‌ల‌తో ఇసుక కొర‌త తీవ్రంగా ఏర్ప‌డింది. దీంతో పాటుగా  ఇసుక అక్ర‌మాల‌ను అరిక‌ట్టి ప్ర‌జ‌ల‌కు పాద‌ర్శ‌కంగా ఇసుకను అందించాల‌నే ల‌క్ష్యంతో కొత్త పాల‌సీని తీసుకొచ్చింది జ‌గ‌న్ స‌ర్కారు. పాల‌సీ తెచ్చిన జ‌గ‌న్ స‌ర్కారు ఇసుక తోడి డంప్ చేద్దామ‌నుకునే స‌మ‌యానికే వ‌ర‌ద‌లు రావ‌డంతో అది కుద‌ర‌లేదు. దీంతో ఇసుక కొర‌త ఏర్ప‌డిన విష‌యం లోక‌మంతా తెలిసిందే.


వ‌ర‌ద‌లు రావ‌డం, ఇసుక కొర‌త ఏర్ప‌డటం ఇది జ‌గ‌న్ చేసిన త‌ప్పిదంగా ఏపీలోని ప్ర‌తిప‌క్ష నేత బాబోరు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్, బీజేపీ, క‌మ్యూనిస్టులు ఒక‌టే రాద్దాంతం. ప్ర‌తిప‌క్షాలు అన్ని క‌లిసి ఇసుక కొర‌త జ‌గ‌న్ సృష్టించిందే అని విమ‌ర్శిస్తున్నారు.  ఈ ఇసుక కొర‌త ను తీర్చేందుకు జ‌గ‌న్ స‌ర్కారు శాయ‌శక్తులుగా కృషి చేస్తూనే ఉంది. కానీ ఈ ఇసుక కొర‌త‌ను పెద్ద‌దిగా చేసి ప్ర‌తిప‌క్షాలు రాజ‌కీయం చేయ‌డం చూస్తుంటే శ‌వాల‌పై పేలాలు ఏరుకునే తీరుగా ఉంది. వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌ల‌తో చ‌నిపోయిన వారిని కూడా ఇసుక కొర‌త‌తోనే ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని క‌ల‌రింగ్ ఇస్తూ ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న నీచ‌మైన రాజ‌కీయానికి తెర లేపాయి.


అయితే ఇసుక కొర‌త‌ను గోరంత‌ను కొండ‌లు చేసి చూపే ప్ర‌య‌త్నంలో జన‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంగ్‌మార్ఛ్ చేసి బొక్క‌బోర్లా ప‌డ్డారు. లాంగ్ మార్చ్ అని చెప్పి కారుపై ఊరేగిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ దీనిని నీచమైన ఈ ప‌నిని త‌న‌కు తానే స‌మ‌ర్ధించుకున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన దీక్ష‌లో ఇసుక‌ దొంగ‌లైన టీడీపీ నేత‌లు పాల్గొని ఏ సంకేతం ఇచ్చిన‌ట్లు అనేది ఏపీ ప్ర‌జ‌లు ప‌సిగ‌ట్టారు. ఇక ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ బాట‌లో బాబోరు న‌డ‌వ‌బోతున్నారు. ఈనెల 14న విజ‌య‌వాడ‌లో ఇసుక కొర‌త‌పై ఆందోళ‌న చేయాల‌ని బాబోరు సంక‌ల్పించారు. ఈ ఇసుక దీక్ష‌కు విజ‌య‌వాడ క‌మిష‌న‌ర్ అనుమ‌తి ఇవ్వ‌లేదు. అయితే అనుమ‌తి రాకున్నా దీక్ష చేసి తీరుతామ‌ని బాబోరు అంటున్నారు.


అయితే ఇక్క‌డ  బాబోరు ఇసుక కొర‌త‌పై దీక్ష చేయ‌డం దెయ్యాలు వేదాలు వ‌ల్లించిన‌ట్లే. బాబోరి  పాల‌న‌లో ఇసుకాసూరులు సాగించిన దోపిడి అంతా ఇంతా కాదు. బాబోరి అనుచ‌రులు, ఎమ్మెల్యేలు, మంత్రులు సాగించిన ఇసుక దందా జ‌గ‌మెరిగిన స‌త్య‌మే. బాబోరి పాల‌న‌లో ఇసుక దందా తో ఎంద‌రో ప్రాణాలు కొల్పోయారు. అధికారులు దాడుల‌కు గుర‌య్యారు. అయినా చంద్రాలు తాను నీతిమంతుడిని అని ఇసుక కొర‌త‌పై దీక్ష చేయ‌డం విడ్డూర‌మ‌నే చెప్పొచ్చు. అస‌లు బాబోరు దీక్ష చేయ‌డ‌మే బాగోదు అని ఏపీ ప్ర‌జలు అనేంత‌గా ఉంది. చంద్రాలు తీసుకున్న ఈ దీక్ష నిర్ణ‌యంతో ఉన్న ప‌రువు కాస్తా బ‌జారున ప‌డిన‌ట్లే లెక్క‌. బాబు దీక్ష‌పై సొంత పార్టీ నేత‌లే పెద‌వి విరుస్తున్నారంటే బాబోరు తీసుకున్న ఈ నిర్ణ‌యం బాగుండ‌ద‌నే ఆభిప్రాయం స‌ర్వ‌త్రా వ్య‌క్తం అవుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: