ఈరోజు.. దేశంలో దశాబ్దాల తరబడి పెండింగులో ఉన్న.. అతి కీలకమైన అయ్యోధ్య అంశంపై తుది తీర్పురాబోతోంది. ఈ తీర్పు కోసం యావత్ దేశం ఉత్కంఠ గా ఎదురు చూస్తోంది. ఇప్పటికే జన్మస్థానం హిందువులదే అని గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పుడు తీర్పు ఎలా వస్తుందో అన్నది ఉత్కంఠ రేపుతోంది.


ఈ నేపథ్యంలో ఈ కేసు చిక్కుముడి ఏంటో చూద్దాం..

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరంలో 2.77 ఎకరాల చుట్టారా వివాదం రాజుకుంది. హిందూ దేవుడైన రాముడి జన్మస్థలంగా పరిగణించే స్థలంతో పాటు.. బాబ్రీ మసీదు కూడా ఉన్న స్థలం విషయంలో వివాదం నడుస్తోంది. రాముడి జన్మభూమిలోని ఆలయాన్ని కూల్చేసి.. మసీదును నిర్మించారనే ఆగ్రహంతో 1992 డిసెంబర్ 6వ తేదీన కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చేశారు.


ఆ ఉదంతం తర్వాత ఆ భూమి మీద యాజమాన్యానికి సంబంధించి అలహాబాద్ హైకోర్టులో కేసు నమోదైంది. ఆ కేసులో 2010 సెప్టెంబర్ 30వ తేదీన తీర్పు ప్రకటించారు. అయోధ్య భూమిని మూడు భాగాలుగా విభజించాలని.. అందులో ఒక భాగం హిందూ మహా సభ ప్రాతినిధ్యం వహిస్తున్న రామ్ లల్లాకు, రెండో భాగం సున్నీ వక్ఫ్ బోర్డుకు, మూడో భాగం నిర్మోహి అఖాడాకు వెళుతుందని తీర్పు చెప్పారు.


2010 నాటి తీర్పుకు వ్యతిరేకంగా హిందువులు, ముస్లింలు అప్పీలు చేయటంతో ఆ తీర్పును సుప్రీంకోర్టు 2011లో సస్పెండ్ చేసింది. 2010లో ఇచ్చిన తీర్పులో మొఘల్ సామ్రాజ్య వ్యవస్థాపకుడైన బాబర్ నిర్మించిన ఆ భవనం నిజానికి మసీదు కాదని పేర్కొన్నారు. కూల్చి వేసిన హిందూ దేవాలయంలో ఇస్లాం సూత్రాలకు వ్యతిరేకంగా దానికి నిర్మించారని వ్యాఖ్యానించారు. ఈ ధర్మాసనంలో ఉన్న ముస్లిం న్యాయమూర్తి ఒకరు ఈ అభిప్రాయంతో విభేదించారు. అక్కడ ఏ ఆలయాన్ని ధ్వంసం చేయలేదనీ, ఆ మసీదుని శిథిలాల మీద నిర్మించారని ఆయన వాదించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: