"పాండవులకు సూది మొన మోపినంత భూమిని కూడా ఇవ్వనన్న సార్వంసహా సార్వభౌముడు సుయోధనుడు ఏమయ్యాడు? గుర్తుకు తెచ్చుకో కేసీఆర్! హైకోర్ట్ చెప్పినట్లు ఇవ్వాలనుకుంటే ఆర్టీసీకి ₹ 46 కోట్ల కనీస మొత్తం యివ్వలేకపోయావా?"  అంటున్నారు తెలంగాణా జనం ముక్తకంఠంతో.

శ్రీకృష్ణుడు రాయబారం కోసం హస్తినకు వెళ్ళినపుడు దుర్యోధనుడు స్వయంగా తానే చెప్పుకున్న మాట, అతడి స్వభావాన్ని  తెలియజేస్తుంది.

"జానామి ధర్మం న చ మే ప్రవృత్తిః
జానామి అధర్మం న చ మే నివృత్తిః"

భావం:  నాకు ధర్మం ఏమిటో తెలుసు, కానీ నాకది చెయ్యాలనిపించదు
అధర్మం ఏమిటో కూడా తెలుసు, నాకు అదే చెయ్యాలనిపిస్తుంది.

దుర్యోధనునిలా అన్ని తెలిసి ప్రతిపక్షాలు చెపుతున్నట్లు స్వప్రయోజనాల సాధన కోసం టిఎస్-ఆర్టీసి ని గంపగుత్తగా తన అనుయాయులకు అమ్మెసే ప్రయత్నాలను తెరదీశారనటంలో అతిశయోక్తి ఏమాత్రం లేదంటున్నారు విశ్లేషకులు

Image result for egoistic kcr warned by high court about rtc Strike

ఇది ప్రజాస్వామ్యం. శాసనాలు చేసే అధికారం ప్రజల చేత ఎన్నికైన శాసన సభ్యులతో కూడిన శాసనవ్యవస్థ  ఉన్నా, దాన్ని అమలుచేసే 'ఎక్జెక్యూటివ్ వ్యవస్థ' ఒకటుంది. వీటి మద్య 'న్యాయ సంభందిత వివాదాలొచ్చినప్పుడు వాటిని పైష్కరించే నిమిత్తం 'న్యాయ వ్యవస్థ'  మరొకటుంది. ఈ మూడు వ్యవస్థలు వేటికవి స్వతంత్రంగా వ్యవహరించాల్సి ఉన్నా తెలంగాణాలోని "ఎక్జెక్యూటివ్ వ్యవస్థ" ప్రభుత్వానికి "కాల్మొక్కుత బంచన్ దొరా!" అన్నట్లు దిగజారింది. దాంతో ముఖ్యమంత్రి తానొక సార్వభౌముడ నని అనుకోవటానికి అవకాశం ఏర్పడింది

అధికారులు తమకు వెన్నెముఖ ఒకటుందనే విషయం మరచిపోయిన దరిమిలా ప్రభుత్వం ఆర్టీసి ఉద్యోగులపై చేలరేగి పోతోందు. సీనియర్ ఐఏఎస్ లతో కూడిన అధికార యంత్రాంగం హైకోర్ట్ లో అబద్ధాలపుట్టగా తమను తాము ఋజువుచేసుకున్నారు.

సమస్య న్యాయస్థానానికి చేరినా సిగ్గుశరం లేకుండా తప్పుడు నివేదికలిచ్చి - అనువుగాని చోట అనువు గాని వేళ – అంటే ఆర్టీసీ యూనియన్లు నెలరోజులకుపైగా సమ్మె చేస్తూ ఉన్నా గత నెలకు పైగా ప్రజారవాణా లేకపోయినా వారిపై జనాగ్రహం చెలరేగక పోవటానికి కారణం ప్రజలు సహనం వహించటానికి కారణం ఆర్టీసీ కార్మికులపై సానుభూతి మాత్రమే. తెలంగాణా ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ - ఆహం (ఇగో) మాత్రమే కారణం అని గుర్తించారు.
Image result for egoistic kcr warned by high court about rtc Strike
రాష్ట్రంలో ప్రతిఒక్కరికీ ఆర్టీసీ విషయంలో కేసీఆర్ తానుబట్టిన కుందేటికి మూడేకాళ్ళంటూ కావాలనే మొండిగా ఉన్నారన్న విషయం బాగా అర్థమవుతుంది. కేసీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రే కాని సార్వం సహా సార్వభౌముడు మాత్రం కాదు.

ఉద్యోగుల మాట నేను వినడం ఏంటి?  ఏమిటి అని ఆయన అనుకోవచ్చు. తానే నెగ్గాలను కోవడం వేరు, నలుగురినీ కలుపుకొని వారిని కూడా గెలిపిస్తూ  తాను నెగ్గుతూ పోవడం వేరు. కేసీఆర్ తెలంగాణకు అధినేత కావచ్చు ఆయనకు ఆ పదవి ఇచ్చింది మాత్రం ప్రజలే. సిగ్గుతో విలవిల్లాడాల్సిన విషయమేమంటే అసలు "ఉనికే లేని ఆర్టీసిని మూసేస్తాను" అని ప్రగల్భాలు పలికాడు. అసలు ఆ ప్రశ్న అడగటానికున్న అవకాశం ఉనికే ప్రశ్నార్ధకం అవుతుంది

ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారం అంతా ఒకరి చేతిలోనే ఉన్నట్టుంటుంది కాని అది ఒట్టి భ్రమ మాత్రమే.  ఫ్రభుత్వం లోని వారు ప్రజాస్వామ్యయుతంగా ఉన్నంత వరకు మాత్రమే ఆ ఆధికారం వారికి అందుబాటులో ఉంటుంది. . అలా కాకుండా ఎడా పెడా అధికారం వాడేస్తే, క్రమంగా అది హారతి కర్పూరంలా హరించుకుపోతూ ఉంటుంది. ఒకనాటికి అది అధినేతకు అందనంత దూరమవుతుంది. చరిత్ర చెపుతూ వస్తున్న యధార్ధమిది. కేసీఆర్ విషయంలో మరో సారి ఋజువైంది అంతే!
Image result for egoistic kcr warned by high court about rtc Strike
తెలంగాణ ఆర్టీసీ సంక్షోభం విషయంలో కేసీఆర్ తనదే పైచేయి అనుకునే క్రమంలో ప్రతిసారీ ఓడిపోతున్నారు.  తనకు అధికారం సంప్రాప్తించటానికి కారణమైన ఆర్టీసి కార్మికులను బెదరగొట్టాడు, బెదిరించాడు, భయపెట్టాడు, కడకు ఉద్యోగాలు పీకేస్తానన్నాడు - కాని చీము రక్తం ఉంటే ముఖ్యమంత్రే పదవి తనకు తానే పీక్కోవాల్సిన  పరిస్థితి వచ్చింది.

కానీ వీటన్నింటికి మించి కేంద్రం విసిరిన "మధర్ ఆఫ్ ఆల్ స్ట్రొక్స్" తో  నేడు విలవిల్లాడుతున్నాడు.  కేసీఆర్ ఏ కోశానా ఈ పరిస్థితిని ఊహించ లేదు. ఆర్టీసీ విషయంలో హైకోర్టులో జరుగుతున్న వాదనల్లో ఈ రోజు కేంద్రం పాల్గొంది. ఈ సందర్భంగా కేంద్రం వినిపించిన వాదనలతో కేసీఆర్ ప్రభుత్వానికి దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది.

ఇదిలా ఉండగా, ఏపీఎస్‌ ఆర్టీసీలో కేంద్రానికి 33 శాతం వాటా దానంతటది  టీఎస్‌ ఆర్టీసీకి బదిలీ కాబోదని కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు చెప్పడం విశేషం. ఈ వాదనలను కేంద్రం తరపున లాయర్‌ రాజేశ్వర్‌రావు కోర్టుకు వివరించారు. "టీఎస్‌- ఆర్టీసీ అసలు ఏ విధమైన చట్టబద్ధతతో ఎలాంటి ఉనికే లేని సంస్థ అని పేర్కొన్నారు. ఏపీఎస్‌- ఆర్టీసీని విభజిస్తే తప్పని సరిగా కేంద్రం అనుమతి తీసుకోవాలని, కేంద్రం అలాంటి అనుమతి ఇవ్వనేలేదన్నారు. నాటి ఏపిఎస్ ఆర్టీసీ - 1. ఏపీఎస్‌ ఆర్టీసీ మరియు టీఎస్‌ ఆర్టీసీ - రెండుగా విభజన జరిగిందా?  2. టీఎస్‌-ఆర్టీసీ కొత్తగా ఏర్పాటైందా?  3. ఆర్టీసీ అంటే టీఎస్‌-ఆర్టీసీయేనా? లేక ఏపీఎస్‌ ఆర్టీసీనా?  ఇవి కోర్టు వేసిన ప్రశ్నలు. ఈ వాదనతో కేసీఆర్ ప్రభుత్వానికి  కోర్టు వేసిన ప్రశ్నలకు మైండ్ బ్లాంక్ అయ్యింది.

Image result for egoistic kcr warned by high court about rtc Strike

దీనికి తెలంగాణ సీఎస్‌ ఎస్కే జోషి బదులిస్తూ, విభజన చట్టంలో షెడ్యూల్‌ 9  కిందకు ఆర్టీసీ వస్తుందన్నారు. పునర్విభజన చట్టం లోని సెక్షన్‌ 3 ప్రకారం టీఎస్‌ ఆర్టీసీ ఏర్పాటైందని, ఏజీతో పాటు ఆర్టీసీ ఇన్-చార్జ్‌ ఎండీ తెలిపారు. ఆర్టీసీ విభజన అంశం కేంద్రం దగ్గర పెండింగ్‌ లో ఉందని అడ్వకేట్‌ జనరల్‌ చెప్పారు.దీంతో న్యాయ మూర్తి జోక్యం చేసుకుని ఒకవైపు విభజన పెండింగ్‌ లో ఉందని చెబుతున్నారు. మరో వైపు మీరు కొత్త ఆర్టీసీని ఏర్పాటు చేశామంటున్నారు. ఇదెలా సాధ్యమని ప్రశ్నించారు. ఏపీఎస్‌ ఆర్టీసీ విభజన కోసం రెండు రాష్ట్రాలూ కేంద్ర అనుమతి కోరాలి కాదా! అని నిలదీసింది ధర్మాసనం.

కేంద్రం అనుమతి లేకుండా రెండు కొత్త సంస్థలు ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించింది. ఆర్టీసీ విభజనకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు ఆధారాల్లేవని కోర్టు  స్పష్టం చేసింది. దీంతో ఏం చెప్పాలో తెలియక ఫ్లేటు ఫిరాయించారు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు.  ఏపీఎస్‌ ఆర్‌టీసీ ఆస్తులు, అప్పుల విభజన ప్రక్రియకు చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో ప్రజలకు అసౌకర్యం కలుగకుండా టీఎస్‌-ఆర్టీసీ ఏర్పాటు చేశామని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు హైకోర్టుకు తెలిపారు. ఇదెలా సాధ్యం. ప్రజల పేరు చెప్పి కేంద్రం అనుమతి లేకుండా పెండింగ్‌ లో ఉన్న దానిపై స్వతంత్రంగా ఎలా వ్యవహరిస్తారు?  కోర్టు ప్రశ్నించింది. ఆర్టీసీ విభజన జరగకుండా ప్రభుత్వం ఎలా నోటిఫికేషన్‌ ఇస్తుందని నిలదీసింది. సెక్షన్‌ 47 ఏ పై సుదీర్ఘ విచారణ జరుపుతోంది.

చివరకు విసుగు చెందిన హైకోర్టు. ప్రభుత్వానికి సమస్యను పరిష్కరించే ఉద్దేశం ఉందా? అని కూడా గట్టిగా ప్రశ్నించింది. మీరు కోర్టు సమయం వృథా చేస్తూ, ఉద్దేశ పూర్వకంగా తప్పుడు నివేదికలు ఇస్తే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని అధికారులను హెచ్చరించింది.

Image result for egoistic kcr warned by high court about rtc Strike
ఆర్థిక శాఖ  రెండు నివేదికలు ఇస్తే, అవి పరస్పర విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది. ఐఏఎస్ అధికారులు అసమగ్ర నివేదిక లివ్వడంపై కోర్టు విస్మయం వ్యక్తంచేసింది. కనీసం మొన్న మీరు ఇచ్చిన నివేదికనే మీరు చదవలేదని పేర్కొంది. దీంతో మళ్లీ ఫ్లేటు ఫిరాయించారు తెలంగాణ అధికారులు. సమయం తక్కువగా ఉండటం వల్ల రికార్డుల ఆధారంగా నివేదిక రూపొందించామని, మన్నించాలని హైకోర్టును వేడుకున్నారు.

సిగ్గుతో విలవిల్లాడాల్సిన విషయమేమంటే మంత్రిని ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించినట్లు ఆర్టీసీ ఎండీ నివేదికలో స్వయంగా అంగీకరించడం అన్నారు. సీఎంను మంత్రి మండలిని, రవాణా శాఖ మంత్రిని కూడా తప్పుదోవ పట్టించేలా నివేదికలున్నాయని ఇంతకంటే ఘోరం ఇంకేమైనా ఉంటుందా? అని మండిపడింది. ఇంత మందిని తప్పుదోవ పట్టించినవారు నిజాలు చెబుతున్నారని ఎలా నమ్మాలంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇది చాలు ఈరోజు హైకోర్టులో జరిగిన వాదనలతో ప్రభుత్వం అడ్డంగా బుక్కైనదనే చెప్పాలి. కార్మికులపట్ల జనం జాలి చూపే అవకాశం ఉంది గాని కేసీఆర్ ప్రభుత్వానికి వస్త్రాపహరణం జరిగింది ఇక గట్టిగా మూల్యం చెల్లించుకోక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: