గడచిన నాలుగు నెలలుగా జగన్మోహన్ రెడ్డి పడతున్న ఇబ్బందుల నుండి పెద్ద రిలీఫ్ రానున్నట్లే కనబడుతోంది. వరద నీటి ప్రవాహం తగ్గుముఖం పడుతుండటంతో ఇసుక సరఫరా మొదలైంది. నాలుగు రోజుల నుండి వివిధ రీచుల్లో ఇసుక తవ్వకాలు ఊపందుకున్నట్లే చెప్పాలి.  ఈనెల 1 వ తేదీన  31,576 టన్నుల ఇసుకను మాత్రమే సరఫరా చేయగలిగింది ప్రభుత్వం. అలాంటిది శుక్రవారం నాడు 96,600 టన్నుల ఇసుకను సరఫరా చేసింది.

 

అంటే నాలుగు రోజులుగా ఇసుక లభ్యత పెరుగుతున్న విషయం అర్ధమవుతోంది. రోజు రోజుకు రీచుల నుండి ఇసుక లభ్యత పెరుగుతుండటంతో సరఫరా కూడా పెరుగుతోంది. బహుశా మరో వారం రోజుల నుండి వినియోగదారులకు కావాల్సినంత ఇసుక దొరికేందుకు అవకాశాలు కనబడుతున్నాయి.

 

వరదనీటి ప్రవాహం తగ్గటం, ఇసుక లభ్యత పెరిగి సరఫరా పెరుగుతుండటమన్నది చంద్రబాబునాయుడు అండ్ కో కు ఏమాత్రం రుచించనిదనే చెప్పాలి. ఇసుక కొరత ఉన్నమాట వాస్తవమే కానీ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నంత స్ధాయిలో మాత్రం లేదు. మొత్తం 207 రీచుల నుండి ఇసుక సరఫరా చేయాలని ప్రభుత్వం అనుకుంటే వరదలు, వర్షాల వల్ల 65 రీచుల నుండి మాత్రమే ఇసుక సరఫరా చేయగలుగుతున్నారు.

 

దాదాపు 70 శాతం రీచులు నీటిలో ముణిగి ఉన్న కారణంగా ఇసుకను ఇన్ని రోజులు తవ్వకాలు జరపలేక, సరఫరా చేయలేక పోయింది ప్రభుత్వం. సరే ఇసుక దొరుకుతోందా లేదా అని మత్రమే చూస్తారు జనాలు. జనాల కోణంలో చూస్తే పూర్తిగా కాకపోయినా పాక్షికంగా అయినా  ప్రభుత్వం విఫలమైనట్లే అనుకోవాలి.

 

నిజానికి ఇసుక కొరతకు ప్రధాన కారణం చంద్రబాబునాయుడే అని చెప్పాలి. వర్షాలు, వరదలు వస్తాయన్న ముందు చూపు లేకుండా ఇసుక తవ్వకాలు జరిపి స్టాక్ పాయింట్లలో నిల్వ చేయటంలో ఫెయిలయ్యారు. తెలంగాణాలో ముందుచూపుతో వేల టన్నుల ఇసుకను స్టాక్ పాయింట్లకు తరలించటంతో మూడు నెలలు కొరత అన్నది తలెత్తలేదు. కానీ నిల్వలు అయిపోతుండటంతో ఇపుడు తెలంగాణాలో కూడా ఇసుక కొరత మొదలైంది. అదే చంద్రబాబు కూడా ముందస్తుగా ఇసుకను స్టాక్ పాయింట్లలో స్టాక్ చేసుంటే సమస్య ఇంత తీవ్రంగా ఉండేది కాదు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: