తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఇటు ఆర్టీసీ కార్మికులు, అటు ప్ర‌భుత్వ మొండి వైఖ‌రి మ‌ధ్య ప్ర‌జల‌కు ఇక్క‌ట్లు త‌ప్ప‌ట్లేదు. బ‌స్సులు లేక సామాన్య ప్ర‌జ‌లు ప‌డే ఇబ్బందులు మాములుగా లేవు. ఎటువంటి స‌మ‌స్య‌నైనా ఏ ప్ర‌భుత్వ‌మైనా స‌రే తాడో పేడో తేల్చేసి ఏదో ఒక నిర్ణ‌యానికి వ‌చ్చేది కాని ఎందుకోగాని ఈ ప్ర‌భుత్వం చాలా మొండి వైఖ‌రితో వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రి ఈ నేప‌ధ్యంలో ఆర్టీసీ కార్మికుల చలో ట్యాంక్‌బండ్‌ ఆందోళన కార్యక్రమం చేప‌ట్టారు.  ప్రజలు, ప్రజాస్వామ్య వాదులు, మేధావులు, విద్యావంతులు ప్రతి ఒక్కరు దీని ప‌ట్ల ఆలోచించాలి. 


చలో ట్యాంక్‌బండ్‌ ఆందోళన కార్యక్రమం నేపథ్యంలో ములుగు జిల్లాలో వివిధ పార్టీలకు చెందిన నాయ‌కుల‌ను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. మెదక్ జిల్లా నర్సాపుర్‌లో 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరులో బీజేపీ నాయకుల అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మంచిర్యాల డిపోకు చెందిన 17 మంది కార్మికులను పోలీసులు  అరెస్టు చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ నాయకులను.. ఆర్టీసీ కార్మికులను ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. 


ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు మూడంచెల భద్రత ఏర్పాటు చేయడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో వారిని కూడా పోలీసులు అనుమతించకపోవడంతో ఉద్యోగాలకు, కాలేజీలు, పాఠశాలలకు వెళ్లే వారు ఇబ్బందులు పడుతున్నారు. రహదారులు మూసివేసి, ట్రాఫిక్‌ మళ్లించడంతో కష్టాలు పడుతున్నామని స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు, ఆర్టీసీ కార్మికులు, కార్మిక సంఘాల నేతలు, విద్యార్థులు ట్యాంక్‌బండ్‌కు తరలి వచ్చేందుకు యత్నిస్తున్నారు. శనివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ పూర్తిగా మూసేస్తున్నామని నగర ట్రాఫిక్‌ విభాగం అదనపు సీపీ అనిల్‌కుమార్‌ తెలిపారు. మ‌రి తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఓ ప‌క్క‌కార్మికుల గొడ‌వ‌లు వీట‌న్నిటిని చూస్తూ కూడా ప్ర‌భుత్వం నిమ్మ‌కు నీరెత్త‌ని రీతిలో ఎందుకు ప్ర‌వ‌ర్తిస్తున్న‌ది అర్ధం కావ‌డంలేదు. ఆయ‌న ఉద్దేశ్యం ఆర్టీసీని ప్రైవేటీక‌ర‌ణ చేసేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.  అందులోని ఎత్తుగ‌డ‌లే ఇవ‌న్నీ అని మ‌రికొంద‌రు భావిస్తున్నారు. వీట‌న్నిటివ‌ల్ల చెప్పాలంటే రోజు రోజుకు ఆయ‌న ఆయ‌న ప్ర‌తిష్ట దిగజార‌తున్న‌ట్లేన‌ని కొంద‌రు భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: