దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపబోయే కీలక అయోధ్య భూవివాదం కేసులో అత్యున్నత న్యాయస్థానం నేడు తీర్పు వెలువరించనుంది. దీంతో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. దేశం అంతటా ఈ తీర్పు కోసం ఉత్కంఠంగా ఎదురు చూడగా ఈ తీర్పు కారణంగా ఎక్కడ అల్లర్లు జరగకూడదని అన్ని చోట్ల భద్రత కట్టుదిట్టం చేశారు.  

                    

అయితే ఈ నేపథ్యంలోనే ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుమలలోని శ్రీవారి ఆలయం పరిసరాల్లో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. 30 మంది క్విక్ సరెస్పాన్స్ టీమ్ తో పాటు మూడు వందల మంది అక్టోపస్ సిబ్బందిని అధికారులు అప్రమత్తం చేశారు. కాగా తిరుమల కొండ కింద తిరుపతి అలిపిరి తనిఖీ కేంద్రం, తిరుమల జీఎన్సీలో తనిఖీలను ముమ్మరం చేశారు. 

                       

1650 సీసీ కెమెరాల ద్వారా తిరుమలలో భద్రతను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కాగా రామ జన్మభూమి అయోధ్య తీర్పు వెలువడనున్న సమయంలో భారతదేశంలోని అన్ని ప్రధాన చారిత్రాత్మక దేవాలయాల్లోను భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ తీర్పు వచ్చే సమయంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. 

                      

ఈ నేపథ్యంలోనే  ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది చెందిన తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి దేవాలయంలో అణువణువులను నిఘా కళ్ళతో పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. అన్నిప్రాంతాల్లోను అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉన్నారు. కాగా మరి కొద్దిసేపట్లో అయోధ్య తీర్పు వెలువడనుంది. 

                    


మరింత సమాచారం తెలుసుకోండి: