గత 134 ఏళ్లగా అయోధ్యలో ఉన్న 2.77 ఎకరాల స్థలంపై హిందూ, ముస్లింల మధ్య కొనసాగుతున్న వివాదం పై ఈరోజు ఉదయం 10.30 గంటలకు సుప్రీంకోర్టు అంతిమ తీర్పు ఇవ్వనున్నది. ఈ సున్నితమైన కేసుపై సుప్రీమ్ కోర్ట్ తుది తీర్పును ఇస్తుండడంతో దేశవ్యాప్తంగా హై అలెర్టు ను ప్రకటిస్తూ... హిందూ ముస్లిం మత వర్గాలు శాంతంగా ఉండాలంటూ ప్రధాన మంత్రి నిన్న రాత్రి ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేసారు. 

 

 
'అయోధ్య కేసులో సుప్రీమ్ కోర్టు ఏ తీర్పు ఇచ్చినా అది ఒకరి విజయమో మరొకరి అపజయమో కాదు. దేశ ప్రజలంతా శాంతి, సద్భావనతో మెలగాలి. న్యాయవ్యవస్థల పట్ల గౌరవాన్ని కాపాడేలా అన్నీ సామాజికి సాంస్కృతిక వర్గాలు కృషిచేయాలి,' అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ లో పేర్కొన్నారు. 

 

అయోధ్య భూ వివాదం కేసు తీర్పుపై లైవ్ అప్డేట్స్... 
 
11:40 am IST
 
మాకు 5 ఎకరాల  ప్రత్యామ్నాయ స్థలం అవసరం లేదు కానీ సుప్రీంకోర్టు తీర్పుని గౌరవిస్తున్నాం- సున్నీ వక్ఫ్ బోర్డు.
 
11:35 am IST
 
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 
 
11:32 am IST
 
వివాదాస్పద స్థలాన్ని ప్రభుత్వం వెంటనే స్వాధీనపరచుకొని మూడు నెలల్లో కేంద్రం అయోధ్య ట్రస్ట్ ని ఏర్పాటు చేయాలని..సుప్రీమ్ కోర్టు.
 
11:30 am ISP
 
మసీద్ నిర్మాణానికి 5 ఎకరాలు స్థలాన్ని సున్ని వక్ఫ్ బోర్డు కి కేటాయించిన సుప్రీమ్ కోర్టు.  
 
మసీదు నిర్మాణం కోసం వేరే స్థలాన్ని కేటాయించాలి అంటున్నా సుప్రీమ్ కోర్టు. 
 
11:20 am IST
 
వివాదాస్పద స్థలంలో మసీదు ఉంది, అక్కడ ముస్లింలు నమాజ్ చేసుకోవచ్చని.. సుప్రీమ్ కోర్టు. 
 
11:00 am IST
 
బ్రిటిష్ వాళ్ళు రాకముందు నుంచే రామ్ చబుత్ర, శివ రసోయి పూజింపబడట్లు ఓ రుజువు ఉంది--- రంజన్ గొగోయ్.
 
10:52 am IST
 
'బాబ్రీ మసీదును  ఖాళీ స్థలంలో  నిర్మించలేదు' తీర్పును వెల్లడిస్తున్న రంజన్ గొగోయ్.
 
10:30 am IST
 
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి అయోధ్య భూ వివాద కేసు ను చదివారు. తీర్పు అందరి నిర్ణయాలను బట్టి ఉంటుందని రంజన్ గొగోయ్ చెప్పారు.
 
10:28 am IST
 
ఎటువంటి పుకార్లు, చెడు వ్యాఖ్యలు చేయరాదని ఉత్తరాకాండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ ప్రకటించారు.
 
 
10:25 am IST
 
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలోని అయోధ్య తీర్పును ఇచ్చే ఐదుగురు న్యాయమూర్తులు సుప్రీమ్ కోర్టుకి చేరుకున్నారు.
 
10:20 am IST
 
తీర్పును గౌరవిస్తూ ప్రజలు శాంతిని కాపాడాలి అంటూ బి.ఎస్.పి సుప్రీమో మాయావతి ట్విట్టర్ ద్వారా తెలియచేసారు.
 
9:00 am IST
 
ఆగ్రా లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నామని డిస్ట్రిక్ మేజిస్ట్రేట్ శ్రీ ఎన్ జి రవి కుమార్ ప్రకటించారు.
 
8:40 am IST
 
అయోధ్యలో కేవలం ద్వి చక్ర వాహనాలు తిరిగేందుకు అనుమతి. ఫోర్ వీలర్ వాహనాలు తిరిగేందుకు అనుమతి లేదు. 
 
8:30 am IST
 
నిన్న రాత్రి ఉన్నత అధికారులు తో సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానంద్ ఉత్తరప్రదేశ్-నేపాల్ సరిహద్దు సీల్ చేస్తున్నట్లు తెలిపారు. సరిహద్దు దగ్గర సరైన గుర్తింపు లేని వారిని అనుమతించడంలేదని ఉత్తరప్రదేశ్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ ఫర్ హోమ్ అయినా అవనీష్ అవస్తి చెప్పారు.
 
8:15 am IST
 
అయోధ్య లోని తాత్కాలిక రామ్ మందిర పూజారైన మహంత్ సత్యేంద్ర దాస్ సుప్రీమ్ కోర్టు ఇచ్చే తీర్పును గౌరవించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసారు.
 
8:05 am IST
 
కేశవానంద భారతి కేసు విచారణ 68 రోజులు కొనసాగింది. దాని తర్వాత అత్యంత సుదీర్ఘంగా అనగా 40 రోజులు విచారణ జరిగి అయోధ్య కేసు సుప్రీంకోర్టు చరిత్రలో రికార్డులకెక్కింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: