రాజ్యాంగ ధర్మాసనంలోని ఐదుగురు న్యాయమూర్తులు కొద్దిసేపటి క్రితం సుప్రీంకోర్టుకు చేరుకున్నారు. కోర్టు హాల్ నెంబర్ ఒకటిలో ఐదుగురు జడ్జీలు సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసింది. అయోధ్యలో 12,000 మంది పోలీసు బలగాలతో పాటు 16,000 మంది వాలంటీర్ల సేవలను భద్రత కొరకు ప్రభుత్వం ఉపయోగించుకుంటోంది. 
 
మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ లోని విద్యాసంస్థలకు ప్రభుత్వం సోమవారం వరకు సెలవులు ప్రకటించగా కొన్ని రాష్ట్రాలు ఈరోజు సెలవును ప్రకటించాయి. కోర్టు లోపలికి పిటీషనర్లకు మాత్రమే అనుమతి ఇచ్చారు. అయోధ్య కేసులో తీర్పుపై ఐదుగురు జడ్జీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. రంజన్ గొగోయ్ ఇది చారిత్రాత్మక తీర్పు అని చెప్పారు. షియా వక్ఫ్ బోర్డు పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. 
 
బాబ్రీ మసీదు నిర్మించింది మీర్ భేఖీ అని జస్టిస్ రంజన్ గొగోయ్ అన్నారు. తీర్పు కాపీని చదివేందుకు అరగంట సమయం పడుతుంది. అయోధ్య కేసులో తీర్పు ఏకగ్రీవమని రంజన్ గొగోయ్ అన్నారు. అన్ని మతాలకు రక్షణ కల్పించేందుకు సుప్రీం కోర్టు కట్టుబడినట్లు జస్టిస్ గొగోయ్ పేర్కొన్నారు. రాజకీయాలు, చరిత్రకు అతీతంగా ఈ తీర్పు  ఉంటుందని అన్నారు. 
 
బాబ్రీ మసీద్ నిర్మాణ తేదీపై స్పష్టత లేదని 1949 సంవత్సరంలో విగ్రహాలు మాత్రం ఏర్పాటు చేశారని సీజేఐ పేర్కొన్నారు. ఏ.ఎస్.ఐ మసీదు కింద ఆలయ అవశేషాలు ఉన్నట్లు గుర్తించిందని అన్నారు. అఖాడా వాదనలను, షియా వక్ఫ్ బోర్డ్ వాదనలను న్యాయస్థానం తోసిపుచ్చింది. యాజమాన్య హక్కులు కోరుతూ షియా వక్ఫ్ బోర్డు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. పురావస్తు నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటున్నామని రంజన్ గొగోయ్ అన్నారు. బాబ్రీ అంతర్గత నిర్మాణం ఇస్లామిక్ శైలిలో లేదని సీజేఐ రంజన్ గొగోయ్ అన్నారు. 12వ శతాబ్దం నాటి భారీ పురాతన కట్టడ ఆనవాళ్లు ఉన్నాయని రంజన్ గొగోయ్ అన్నారు. కానీ అది రామాలయం అని చెప్పడానికి ఆధారాలు లేవని అన్నారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: